గుర్రపు బండిపై రాకూడదని అసెంబ్లీ రూల్స్‌లో ఉందా.?:

0 9,692

-కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు

 

హైదరాబాద్ ముచ్చట్లు:

- Advertisement -

భారత్‌ బంద్‌కు మద్దతుగా, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గుర్రపు బండిపై అసెంబ్లీకి రావడం టెన్షన్‌ను క్రియేట్‌ చేసింది. గాంధీ భవన్‌ నుంచి కాంగ్రెస్‌ సభ్యులు గుర్రపు బండిపై వచ్చారు. వారిని అసెంబ్లీ బయటే ఆపేశారు పోలీసులు. దీంతో అక్కడే రోడ్డుపై బైటాయించారు ఎమ్మెల్యేలు. అసెంబ్లీలోకి కార్లలో మాత్రమే రావాలని ఉందా? గుర్రపు బండిపై రాకూడదని అసెంబ్లీ రూల్స్‌లో ఉందా అని ప్రశ్నించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు.కేంద్ర, రాష్ట్రంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేంద్ర నిర్ణయాలు వ్యతిరేకించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు.కేంద్రంలోని బీజేపీ సర్కారు తెచ్చిన నూతన సాగు చట్టాలపై టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం ఏంటో ఈ అసెంబ్లీ సమావేశాల్లో కచ్చితంగా చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. కేంద్ర విధానాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్నారు. కేంద్ర సర్కార్ విధానాలతో రైతులు తీవ్ర నష్టపోతున్నారని.. సాగును ప్రైవేట్వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని సీతక్క ఆరోపించారు.తమిళనాడులోనూ భారత్ బంద్ కొనసాగుతోంది. ఈ రోజు రైతు సంస్థలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు మద్దతుగా చెన్నైలోని అన్నా సలై ప్రాంతంలో పోలీసు బారికేడ్‌ను నిరసనకారులు తొలగించారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకారులు పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

 

భారత్ బంద్ నేపథ్యంలో అంబులెన్సులు, డాక్టర్లు సహా అత్యవసర సేవలకు మేము ఎలాంటి అంతరాయం కలిగించమని భారత్ కిసాన్ యూనియన్నేత రాకేశ్టికాయిత్ స్పష్టం చేశారు. కేవలం కేంద్రానికి సందేశం ఇవ్వడం కోసమే ఈ బంద్ చేపట్టామని ఆయన వివరణ ఇచ్చారు. దుకాణాదారులు సాయంత్రం 4 వరకు షాపులు మూసి ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ చర్చలకు మరోసారి సిద్ధమని కేంద్రం చెప్తున్నా అది కేవలం టీవీలకే పరిమితమైందన్న ఆయన.. మమ్మల్ని నేరుగా ఎవరూ సంప్రదించలేదని పేర్కొన్నారు.కేంద్రంతో ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో సాగు చట్టాల ప్రస్తావన తీసుకురాలేదన్నారు భారత్ కిసాన్ యూనియన్నేత రాకేశ్టికాయిత్. అవి తప్ప ఇతర ఏ సమస్యల గురించి అయినా చర్చించాలని కేంద్రం పేర్కొందని.. అలాంటప్పుడు చర్చల వల్ల ఫలితం లేదని భావించే ఈ భారత్ బంద్ చేపట్టామని ఆయన తెలిపారు.భారత్ బంద్కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. రైతు సంఘాలు ప్రకటించిన భారత్ బంద్‌కు మద్దతివ్వాలని నిలవాలని ఆయన కాంగ్రెస్పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

 

 

 

రైతులు శాంతియుతంగా చేపడుతున్న నిరసనలకు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం వల్లే వారు ఈ విధంగా బంద్ చేపట్టినట్లు రాహుల్ తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా భారత్ బంద్ కు సంఘీభావం తెలియజేయడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమిత అయ్యాయి. దీంతో ఏపీలోని అన్ని జిల్లాల్లో బస్టాండులు నిర్మాణుషంగా మారిపోయాయి. మరోవైపు, బంద్ గురించి అవగాహనలేని పలువురు సామాన్యజనం మాత్రం బస్టాండుల్లో పడిగాపులు కాస్తూ, ఏమీ పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌కు భారత్‌ బంద్‌ సెగ తగిలింది. జనగామ జిల్లాలో దేవరుప్పుల చౌరస్తాలో భారత్ బంద్ నిర్వహిస్తున్న సమయంలో మహబూబాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ కారును అఖిలపక్షం నేతలు అడ్డుకున్నారు.హర్యానా రాష్ట్రంలో జోరుగా భారత్ బంద్ కొనసాగుతోంది. అంబాలా – నాహాన్ రహదారిని పంజోఖ్రా గ్రామం దగ్గర బ్లాక్ చేశారు నిరసనకారులు. దీంతో సదరు రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిపోయే పరిస్థితి నెలకొంది.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Are Assembly Rules Not to Get on a Horse Carriage?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page