విజయనగరంలో అధికార యంత్రాంగం అప్రమత్తం

0 9,663

విజయనగరం ముచ్చట్లు:

బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ కారణంగా విజయనగరం జిల్లా భోగాపురం  మండలం,ముక్కo, చేపల కంచేరు, కొండ రాజుపాలెం  పూసపాటిరేగ తీరప్రాంత గ్రామాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేశారు . ఈ తుఫాను ప్రభావం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తీరప్రాంత గ్రామంలో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమా మహేశ్వరి  పర్యటించారు.  మత్స్యకారులు పడవలు వేటకు వెళ్లే పరికరాలు భద్రంగా ఉంచాలని అన్నారు. అలాగే తుఫాను కారణంగా  మత్స్యకార గ్రామాల్లో సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపారు. భోగాపురం పూసపాటిరేగ తీరప్రాంత గ్రామాల్లో ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచామని తుపాన్ కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించకుండా జాగ్రత్తలు తీసుకుంటామని. ఆమె తెలిపారు.

 

- Advertisement -

Tags:Authorities in Vijayanagar are on high alert

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page