తప్పుడు వార్త ప్రచురణ అంటు ఒక దినపత్రికను తగులబెట్టిన టిఆర్ఎస్ నాయకులు

0 8,553

బెల్లంపల్లి ముచ్చట్లు:

బెల్లంపల్లి లో టిఆర్ఎస్ లీడర్ ల  మరో భూదందా అసైన్డ్ భూమి ఆక్రమించి అమ్ముకుంటున్రు, అని వెలుగు దినపత్రికలో సోమవారం వచ్చిన వార్తను ,ఖండిస్తూ  తప్పుడు వార్త ప్రచురించారు అంటుపట్టణంలోని కాంటా చౌరస్తాలో  టిఆర్ఎస్ యువజన ,టిఆర్ ఎస్వీ నాయకులు, కార్యకర్తలు నిరసన  చేపట్టారు, అనంతరం దిన పత్రిక పత్రులను  తగులబెట్టారు,అనంతరం టిఆర్ ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ మాట్లాడుతూ బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 112 లోని ప్రభుత్వ భూమిని అమ్మరాదు, కొనరాదని తెలిసినప్పటికీ కాంగ్రెస్ పార్టీనాయకులు  భూకబ్జా చేసి అమ్ముకుంటున్నారు, కానీ  టిఆర్ఎస్ పార్టీ పై ఉన్న  అక్కసుతో తమ పార్టీని అభాసుపాలు చేయడానికి తప్పుడు వార్త ప్రచురితం చేశారు. పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా దినపత్రికలో టిఆర్ ఎస్ కు ఎలాంటి సంబంధం లేని,కాంగ్రెస్ వ్యక్తులను టిఆర్ ఎస్ పార్టీ నాయకులు అంటూ తప్పుడు వార్త  వ్రాసిన వారిపై చర్యలు తీసుకుని, వెంటనే పత్రికను మూసివేయాలని,టిఆర్ ఎస్వీ, యువజన నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్, బెల్లంపల్లి నియోజకవర్గ  యువజన, అధ్యక్షుడు మహేష్ గౌడ్, విద్యార్థి అధ్యక్షుడు, అన్వర్,  ఉపాధ్యక్షులు రవితేజ గౌడ్, సన్నీ, ప్రధాన కార్యదర్శి నిఖిల్, టిఆర్ ఎస్వీ మండల అధ్యక్షుడు మహేందర్ ,  పట్టణ, యువ నాయకులు అవినాష్, పట్టణ ఉపాధ్యక్షులు యసీన్ శ్రీనాద్ , ప్రవీణ్ ,  టిఆర్ ఎస్ పార్టీ మైనార్టీ  నాయకులు ఇజాజ్ , నిజాం,   తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:False news publication contagious TRS leaders set fire to a newspaper

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page