గుర్రపు బండిపై అసెంబ్లీకి వెళ్లి 

0 9,267

హైదరాబాద్ ముచ్చట్లు:

 

భారత్‌ బంద్‌కు మద్దతుగా, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గుర్రపు బండిపై అసెంబ్లీకి రావడం టెన్షన్‌ను క్రియేట్‌ చేసింది. గాంధీ భవన్‌ నుంచి కాంగ్రెస్‌ సభ్యులు గుర్రపు బండిపై వచ్చారు. వారిని అసెంబ్లీ బయటే ఆపేశారు పోలీసులు. దీంతో అక్కడే రోడ్డుపై బైటాయించారు ఎమ్మెల్యేలు. అసెంబ్లీలోకి కార్లలో మాత్రమే రావాలని ఉందా? గుర్రపు బండిపై రాకూడదని అసెంబ్లీ రూల్స్‌లో ఉందా అని ప్రశ్నించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు.బీజేపీ సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. CLP నేత భట్టి విక్రమార్క. హైదరాబాద్ లో రెండో రోజు కొనసాగుతున్న శాసనసభ వర్షాకాల సమావేశానికి కాంగ్రెస్ నేతలు గుర్రపు బండ్లపై వెళ్లారు. గాంధీభవన్నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గుర్రపు బండ్లపై వెళ్లి కేంద్ర విధానాలపై నిరసన తెలిపారు.కేంద్ర, రాష్ట్రంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేంద్ర నిర్ణయాలు వ్యతిరేకించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెచ్చిన నూతన సాగు చట్టాలపై టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం ఏంటో ఈ అసెంబ్లీ సమావేశాల్లో కచ్చితంగా చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. కేంద్ర విధానాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్నారు. కేంద్ర సర్కార్ విధానాలతో రైతులు తీవ్ర నష్టపోతున్నారని.. సాగును ప్రైవేట్వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని సీతక్క ఆరోపించారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Go to the assembly on a horse-drawn carriage

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page