తెలంగాణపై గులాబ్  ఎఫెక్ట్

0 8,290

హైదరాబాద్ ముచ్చట్లు:

‘గులాబ్’ తుఫాను తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటడంతో వాయుగుండంగా మారిన గులాబ్.. ప్రస్తుతం తెలంగాణ మీదుగా కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాగల 24 గంటల్లో గంటకు 30-45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.గులాబ్’ ప్రభావం హైదరాబాద్ నగరంపై తీవ్రంగా ఉందని, రాగల 5-6 గంటల్లో నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. నగరానికి రెడ్ అలర్ట్ జారీ అయినందున అత్యవసర పనులుంటే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీచేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని ఏ అవసరం వచ్చినా వెంటనే కాల్‌ సెంటర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
పోలీసుల హై అలెర్ట్
గులాబ్ తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్ర ప్రజలకు పోలీసుశాఖ పౌరులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమయితే తప్ప బయటకి రావొద్దని సూచించింది. లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. నీటి ప్రవాహాలు దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చిరించింది. ఎవరైనా ఆపదలో ఉంటే డయల్ 100ను సంప్రదించాలని పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు కీలక సూచనలు చేసింది. రాబోవు కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరింది.భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అలెర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ అధికారులతో కలెక్టరేట్‌లో కంట్రూల్ రూమ్ ఏర్పాటు చేశారు. సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 040*23202813 కాల్ చేయాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించారు.గులాబ్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్ తోపాటు మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమురంభీం అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం వరంగల్‌, హైదరాబాద్‌, కొత్తగూడెంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులను నియమించి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని జిల్లా కలెక్టర్లు.. అధికారులను ఆదేశించారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Gulab effect on Telangana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page