ఆర్ఆర్ ఆర్ మూవీ మేకర్స్ అధినేత మృతి

0 9,880

హైదరాబాద్ ముచ్చట్లు:

 

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆర్ఆర్ మూవీ మేకర్స్ అధినేత డా. వెంకట్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కీడ్ని ఫెయిల్యూర్ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం హైదరాబాద్‏లోని ఏఐజీ హాస్పిటల్‏లో మృతి చెందారు. వెంకట్ మరణ వార్త విని ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్‏కు గురయ్యింది. వెంకట్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.ఆర్ఆర్ వెంకట్.. 2012లో జోనాథన్ బెన్నెట్ నటించిన ఇంగ్లీష్ సినిమా డైవర్స్ ఇన్విటేషన్ తో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆర్ఆర్ బ్యానర్ పై ఆంధ్రావాలా, కిక్, ప్రేమ కావాలి, డాన్ శీను, మిరపకాయ్ బిజినెస్ మేన్, డమరుకం, పైసా వంటి సినిమాలను ఆయన నిర్మించారు. 2011లో సామాజిక కార్యకర్తగా చేసిన కృషికి కొలంబో విశ్వవిద్యాలయంలో కాంప్లిమెంటరీ మెడిసిన్స్ కోసం ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందారు.  గత కొద్ది రోజులుగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన హైదరాబాదులోని గచ్చిబౌలి ఏఐజి హాస్పిటల్‏లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Head of RRR Movie Makers dies

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page