కొండరాళ్లు పడి వివాహిత మృతి

0 8,554

విశాఖపట్నం ముచ్చట్లు:

పెందుర్తి మండలం నాయుడు తోట సిపిఐ కాలనీకి చెందిన తులసి భావన (31) మృతి చెందింది. గులాబ్ తుఫాన్ కారణంగా రాత్రి నుంచి ఎడతెరిపి వర్షం కారణంగా కొండవాలు ప్రాంతమైన సిపిఐ కాలనీ లో నివసిస్తున్న తులసి భావన కొండరాళ్లు పడి మృతి చెందింది. తులసి భావనకు ఇద్దరు పిల్లలు, భర్త అనారోగ్యంతో ఉన్నాడు. గత రాత్రి  వాల్ ఎంట్రీలు ఆ ప్రాంతమంతా ఖాళీ చేసి, కల్యాణ మండపానికి తరలించారు. ఉదయం కాలకృత్యాలకు వెళ్లిన తులసి భావన, బాత్రూం పక్కనున్న కొండ రాలు మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. జిల్లా కలెక్టర్, జివిఎంసి కమిషనర్, ఎమ్మార్వో, ఘటనా స్థలానికి చేరుకొని, ఘటనపై ఆరా తీశారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Married man killed by falling rocks

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page