మోడీ – కేసీఆర్ కేడి జోడి నంబర్ వన్

0 8,770

– ఇద్దరూ కలిసి దేశాన్ని లూఠీ
-షాద్ నగర్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బంద్ పాటిస్తున్న శ్రేణులు

షాద్ నగర్ ముచ్చట్లు:

- Advertisement -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను దోచుకోవడంలో మోడీ, కేసీఆర్ లు నంబర్ వన్ జోడి అని మోడీ కేడీల కలయిక అపూర్వం అంటూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ విమర్శించారు. సోమవారం భారత్ బంద్ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు షాద్ నగర్ ఆర్టీసీ డిపోను ముట్టడించారు. ఈ సందర్భంగా బస్సులను బయటికి రానీయకుండా గేటు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం  భారత్ బంద్ ను విజయవంతం చేయాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బంద్ పాటిస్తున్నామని వివరించారు. ఇది రాజకీయం కోసం చేస్తున్న బంద్ కాదని ప్రజల కోసం చేస్తున్న బంద్ అని తెలిపారు. ఈ భారత్ బంద్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా  ఎవరికి కేటాయించిన ప్రాంతాల్లో వారు బంద్ను సక్సెస్ చేయాలని నేతలకు విజ్ఞప్తి చేశారు. ఈక్రమంలో భారత్ బంద్కు తెలంగాణ టిడిపి,సిపిఐ, సిపిఎం తదితర అనుబంధ సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతిస్తున్నాయని  ప్రకటించారు. రైతులను ఆదుకోవటంలో తెరాస ప్రభుత్వం విఫలమవుతోందని, ఢిల్లీ పెద్దలతో చర్చించేందుకు వెళ్లిన సమయంలో సిఎం కెసిఆర్ రైతుల సమస్యలపై ఎందుకు చర్చించటం లేదని శంకర్ మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉందని అన్నారు. దేశ ప్రజలు తిరగబడే రోజులు ఆసన్నం అయ్యాయని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కెసిఆర్ ప్రభుత్వ పాలనపై విసుగు చెందారని అన్నారు.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Modi – KCR KD pair number one

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page