నిండుకుండల్లా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లు

0 9,693

హైద్రాబాద్ ముచ్చట్లు:

 

ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరద నీరు ప్రవాహంతో నగరానికి తాగు నీరందించే జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లు పదేళ్ల తరువాత నిండుకుండల్లా నీటితో కళకళలాడుతున్నాయి. నీటి మట్టం పెరగడంతో వరద నీరు మూసీలోకి వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సిబ్బంది, మూసీ నది వెళ్లే మార్గంలో అలర్ట్ ప్రకటించారు. 2010లో కురుసిన భారీ వర్షాలకు ఈజలాశయాలు నిండగా, అప్పట్లో గేట్లు తెరిచారు. ఇప్పడు కురుస్తున్న వానలకు పై నుంచి వరద పెద్ద ఎత్తున రావడంతో ఈరెండు జలాశయాలు నిండిపోయాయి.దీంతో నీటి పారుదల అధికారులు గేట్లు తెరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఎగువ నుంచి మరింత వరద వస్తుంటంతో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేయనున్నట్లు ,ప్రస్తుతం నిల్వ ఉన్న నీటితో మరో రెండేళ్ల వరకు నగర వాసులకు మంచినీటి కొరత ఉండదని వాటర్‌బోర్డు భావిస్తుంది.

 

 

- Advertisement -

స్దానిక ప్రజలు గత నాలుగైదు ఏళ్లుగా వేసవి వచ్చిందంటే ట్యాంకర్ల నీటిపై ఆధార పడాల్సి వచ్చేందని, తాజాగా వరద నీరు చేరడంతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు తాగునీరు తిప్పలు ఉండవని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వం ఈరెండు చెరువులకు వరద నీరు వచ్చే కాల్వలు పకడ్బందీగా నిర్మించి కబ్జాకు గురైన నాలాలను స్వాధీనం చేసుకుని అక్రమార్కులపై చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో నీటి కొరత ఉండదని అధికారులకు సూచిస్తున్నారు. హిమాయత్‌సాగర్ నీటి మట్టం 1763 అడుగుల సామర్దం ఉండగా, ప్రస్తుతం 1760 అడుగులు వరకు పెరిగి, 2.198 టిఎంసిల నీరు చేరింది.అదే విధంగా ఉస్మాన్‌సాగర్ నీటి మట్టం 1790 అడుగుల సామర్దం ఉండగా, ప్రస్తుతం 1772 అడుగులు పెరిగి 0. 960 టిఎంసిలు నీరు చేరినట్లు జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. రెండు జలాశయాల సమీప ప్రాంతాలకు రెండేళ్ల వరకు తాగునీటి ఢోకాలేదని స్దానిక డివిజన్ అధికారులు చెబుతున్నారు.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Nindukundalla Himayat Sagar and Usman Sagar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page