పుంగనూరులో భారత్‌బంద్‌ పాక్షికం

0 9,883

పుంగనూరు ముచ్చట్లు:

 

రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పలు సంఘాలు చేపట్టిన భారత్‌బంద్‌ సోమవారం పాక్షికంగా జరిగింది. పట్టణంలోని ఎస్‌డిపిఐ, ఏఐటియుసి తో పాటు కమ్యూనిస్టు పార్టీలు నిరసన ర్యాలీలు నిర్వహించి, తహశీల్ధార్‌ వెంకట్రాయులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌డిపిఐ అధ్యక్షుడు అతిక్‌బాషా మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి వెంకట్రమణారెడ్డి, ఎస్‌డిపీఐ పార్టీ నాయకులు అబ్ధుల్‌రజాక్‌, ఉజైఫ్‌, సిద్ధిక్‌ పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Part of Bharatbandh in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page