సర్పంచ్ ను కలెక్టర్ తొలగించవచ్చు-హైకోర్ట్ 

0 5,464

అమరావతిముచ్చట్లు:

-విచారణ చేపట్టాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది…

- Advertisement -

ఈ విషయంలో సర్పంచ్ లు మరొకసారి కోర్ట్ తలుపు తట్టవద్దని చెప్పడం జరిగింది.ప్రభుత్వ ఆదేశాలు సక్రమంగా పాటించని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్ లను తొలగించే అధికారం జిల్లా కలెక్టర్ కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.పంచాయతీ రాజ్ చట్టం, 2018 ప్రకారం దీనిపై ఎలాంటి విచారణ చేపట్టాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది.నిధుల దుర్వినియోగం పై రంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామ సర్పంచ్ ను తొలగిస్తూ కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు అయిన పిటీషన్ పై హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.గ్రామ అభివృద్ధి సమస్యలు & అవినీతి నిర్మూలన..పని చేయని సర్పంచ్ ను.. పంచాయతీ రాజ్ చట్టం లోని ఏ సెక్షన్స్ ప్రకారం కలెక్టర్ తొలగించవచ్చు ?తెలంగాణ రాష్ట్రంలో విధులు సక్రమంగా నిర్వహించని గ్రామ పంచాయతీ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను తొలగించే చట్టాలు మరియు వాటిని అమలు పరిచే విధానాలు:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పంచాయతీ రాజ్ చట్టం 2018 :
Part-1 – Section 24 to 37 ప్రకారం…
గ్రామ అభివృద్ధి – సమస్యల పరిష్కారం విషయంలో నిర్లక్షం వహిస్తే…
1. గ్రామ పంచాయతీ రద్దు,
2. గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ తొలగింపు,
3. పంచాయతీ సెక్రటరీ తొలగింపు,
4. వార్డు మెంబర్ల పదవి నుండి తొలగింపు వివరాలు…

వీటన్నింటికి ప్రజల ద్వారా లిఖితపూర్వకంగా కలెక్టర్ కి ఒక లెటర్ రాస్తే చాలు… అందుకే మన రాజ్యాంగాన్ని ‘బై ద పీపుల్’ అన్నారు..

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Sarpanch may be removed by Collector-High Court

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page