కొత్త జెడ్పీ ఛైర్మన్‌ క్రిస్టినాకు షాక్

0 7,797

గుంటూరు ముచ్చట్లు:

గుంటూరు కొత్త జెడ్పీ ఛైర్మన్‌ క్రిస్టినాకు షాక్. ఆమె ఎస్సీ కాదంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తెనాలికి చెందిన సరళకుమారి అనే మహిళ ఈ మేరకు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. క్రిస్టినా తప్పుడు ధ్రువపత్రం సమర్పించారని పిటిషనర్‌ కోర్టుకు వివరించారు. ఈ విషయంపై గతంలో జిల్లా కలెక్టర్‌కూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను ధర్మాసనం 3 వారాలకు వాయిదా వేసింది. ఈ నెల 25న గుంటూరు జిల్లాకు జెడ్పీ ఛైర్మన్‌గా క్రిస్టినా ప్రమాణ స్వీకారం చేశారు. రెండు రోజులకే హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం చర్చనీయాంశమైంది.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Shock to new ZP chairman‌ Christina

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page