ఆకాశం నుంచి జారిపడ్డ ‘స్వర్ణశిల…!!

0 9,696

అమరావతి ముచ్చట్లు:

 

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లా వశి తాలుకాలో ఆకాశం నుంచి అరుదైన రాయి కింద పడింది. స్థానిక రైతు ప్రభు నివృతి మాలి శుక్రవారం ఉదయం 6.30 గంటలకు పొలంలో పని చేసుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఈదురు గాలుల మధ్య భారీ శబ్దంతో ఓ రాయి ఆయనకు ఎనిమిది అడుగుల దూరంలో పడింది…!!వెంటనే తహసీల్దార్‌ నర్సింగ్‌ జాదవ్‌కు ప్రభు సమాచారం ఇచ్చారు. అధికారులు పొలం వద్దకు వచ్చి రాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏడు అంగుళాల పొడవు, ఆరు అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ రాయి బరువు 2.38 కేజీలు ఉన్నట్లు గుర్తించారు…!!తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రాథమిక తనిఖీ పూర్తైన తర్వాత.. ఈ రాయిని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులకు పంపించారు. రంగును బట్టి కొందరు ఈ రాయిని బంగారు శిలగా అభివర్ణిస్తున్నారు…!!

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: The ‘golden rock’ that fell from the sky … !!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page