త‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కత్వంలో దిల్‌రాజు నిర్మాత‌గా భారీ చిత్రం

0 9,667

హైద్రాబాద్ ముచ్చట్లు:

అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు త‌ళ‌ప‌తి విజ‌య్‌. త‌ను చేసే ప్రతి సినిమాతో అతని పాపులారిటీ మరింతగా పెరుగుతోంది. విజ‌య్ త‌న 66వ సినిమాను నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై  జాతీయ అవార్డు గెలుచుకున్న నిర్మాత దిల్ రాజు, శిరీష్ భారీ స్థాయిలో నిర్మించ‌నున్నారు. ఈ రోజు ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు మేక‌ర్స్‌. త‌ళ‌ప‌తి విజయ్, వంశీ పైడిపల్లి మరియు దిల్ రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ  ప్రాజెక్ట్ పై అటు ప్రేక్ష‌కుల్లో ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో విప‌రీత‌మైన బ‌జ్ నెల‌కొని ఉంది. సినిమా రంగం ప‌ట్ల అభిరుచి, నైపుణ్యం క‌లిగిన వ్యక్తుల క‌ల‌యిక‌తో ఈ సినిమా ఒక క్రేజీ ప్రాజెక్ట్‌గా మారింది.
ప్ర‌స్తుతం విజ‌య్ నెల్స‌న్ ద‌ర్శ‌కత్వంలో చేస్తోన్న తన 65వ చిత్రం `బీస్ట్`  పూర్తికాగానే ఈ చిత్రం ప్రారంభమవుతుంది.  ప్రముఖ నటీనటులు మరియు అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు. ఈ చిత్రానికి సంభందించిన మ‌రిన్ని వివ‌రాలు అతి త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Vamsi Paidipally as the hero of Tilapathy Vijay as the producer of Dilraju’s big movie

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page