వర్చువల్ గా డిజిటిల్ మిషన్

0 8,790

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. గత ఏడు సంవత్సరాలలో దేశంలో ఆరోగ్య మౌలిక సౌకర్యాలను బలోపేతం దిశగా చర్యలు కొనసాగుతున్నాయని, నేడు ఇది కొత్త దశలోకి ప్రవేశిస్తోందని తెలిపారు. ‘ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు.. గత ఏడు సంవత్సరాలలో దేశం ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేసే దిశగా సాగుతోంది… నేడు కొత్త దశలోకి ప్రవేశిస్తోంది.. ఇది సాధారణ దశ కాదు. అసాధారణ దశ’ అని మోదీ వ్యాఖ్యానించారు.ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ భారత ఆరోగ్య మౌలిక సౌకర్యాలలో విప్లవాత్మక మార్పునకు సహకరిస్తుంది.. మూడేళ్ల కిందట పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి రోజున ఆయుష్మాన్ భారత్ యోజన ప్రారంభించాం.. ఈ రోజున దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది’ అని మోదీ అన్నారు.ఉచిత వ్యాక్సినేషన్ ద్వారా దేశంలో 90 కోట్ల కోవిడ్ డోస్‌లను పంపిణీ చేసి రికార్డు సృష్టించాం.. దీని కోసం సర్టిఫికేషన్ కూడా జారీ చేస్తున్నాం.. ఈ విజయంలో కొ-విన్ పాత్ర కూడా ఉంది.. ‘రషన్ నుంచి ప్రశాషన్’ వరకు UPIసామాన్యులకు చేరుతోంది … 118 కోట్ల మొబైల్ సబ్‌స్క్రైబర్‌లతో సుమారు 80 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు, 43 కోట్ల ‘జన్ ధన్’ బ్యాంక్ ఖాతాలు, ప్రపంచంలో ఇంత భారీ డిజిటల్ మౌలిక సదుపాయాలు మరెక్కడా చూడలేం’ అని వ్యాఖ్యానించారు.పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య సమస్యలకు వైద్య చికిత్సలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కీలక పాత్ర పోషించనుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్నాలజీ ద్వారా ఆయుష్మాన్ భారత్ దేశవ్యాప్తంగా ఆసుపత్రులతో రోగులను అనుసంధానం చేసే పని మరింత విస్తరించిందని, బలమైన సాంకేతితక వేదికను అందజేసిందన్నారు.ఈ సందర్భంగా దేశంలోని వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను.. కోవిడ్ రోగులకు చికిత్స లేదా వ్యాక్సినేషన్ విషయంలో వారి నిబద్ధత కరోనా వ్యతిరేకంగా పోరాటంలో దేశానికి ఎంతగానో సహకరించి, స్వాంతన చేకూర్చింది.. హాస్పిటల్, హాస్పిటాలిటీ భాగస్వాములు..ప్రపంచ పర్యాటక దినోత్సవం కూడా.. సమగ్ర ఆరోగ్య మౌలిక వసతులు పర్యాటక రంగంపై సానుకూల ప్రభావం చూపుతాయి.. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఇది ప్రతిబింబిస్తుంది. ఎక్కువ టీకాలు వేయడం అంటే ఎక్కువ మంది పర్యాటకులను ఆహ్వానించడమే.. అందుకే హిమాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్‌లో టీకాలు వేగంగా జరుగుతున్నాయి’ అని వివరించారు.పథకంలో భాగంగా 10.74 కోట్ల కంటే ఎక్కువ పేద కుటుంబాలు (దాదాపు 50 కోట్ల మంది లబ్ధిదారులు) లబ్ధి పొందుతున్నారు. ప్రతి కుటుంబానికి ఏటా రూ . 5 లక్షల ఆరోగ్య రక్షణ లభిస్తోంది. డిజిటల్ హెల్త్ మిషన్ కింద దేశంలోని పౌరులందరికీ హెల్త్ కార్డులతో పాటు హెల్త్ ఐడీ కూడా అందిస్తారు. దీని ఆధారంగా ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని అందులో పొందుపరుస్తారు. దీంతో ఎఎవరైనా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లినా, లేదంటే ట్రీట్మెంట్‌ రికార్డ్‌లను పోగొట్టుకున్నా.. చికిత్స అందించాల్సి వస్తే.. మెడిసిన్స్ తీసుకోవాల్సి వచ్చినా వెంటనే ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఎవరైనా ఏదైనా ఆసుపత్రికి వెళ్లినప్పుడు తమ హెల్త్ ఐడీ నమోదు చేయగానే ఆటోమేటిక్ గా ఆ రోగి యొక్క పూర్తి ఆరోగ్య సమాచారం డాక్టర్లకు కనిపిస్తుంది. ఒకవేళ  కొత్త పరీక్షలు చేయాల్సి వస్తే ఆ వివరాలను ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. సంబంధిత సమాచారం ఈ వెబ్‌ సైట్‌లో భద్రంగా ఉంటుంది. కనుక ఆస్పత్రికి వెళ్లి హెల్త్‌ ఐడి చెబితే సరిపోతుంది.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Virtually a digital mission

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page