టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా   విశ్వ‌నాథ్‌,   కేత‌న్ దేశాయ్‌,   విద్యాసాగ‌ర్ ప్రమాణస్వీకారం

0 9,891

తిరుమల ముచ్చట్లు:

 

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా   విశ్వ‌నాథ్‌,   కేత‌న్ దేశాయ్‌,   విద్యాసాగ‌ర్ సోమ‌వారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో   ఎవి.ధ‌ర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అద‌న‌పు ఈఓ అందించారు.

- Advertisement -

రూ.10 లక్షలు విరాళం…

ఈ సందర్భంగా శ్రీ విశ్వ‌నాథ్‌ టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డిడిని అద‌న‌పు ఈవో   ఎవి.ధ‌ర్మారెడ్డికి అందజేశారు.ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి డెప్యూటీ ఈవోలు  రమేష్ బాబు,  సుధారాణి, పేష్కార్  శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Vishwanath, Ketan Desai, Vidyasagar sworn in as TTD Board of Trustees

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page