వందేళ్ల జీవితానికి బాల్యం పునాది లాంటిది

0 9,878

– తల్లిప్రేమలా అంగన్‌వాడీకేంద్రాలు ఆదరించాలి
– సక్రమంగా పౌష్టికారం పంపిణీ జరగాలి
– పౌష్టికార మాసోత్సవంలో ప్రజాప్రతినిథులు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

మానవుడి వందేళ్ల జీవితానికి బాల్యం పునాదని, ఆ దశలోనే నాణ్యమైన పోషకాలతో కూడిన ఆహారంను అందిస్తే పెరుగదలతోపాటు, జ్ఞాపకశక్తి పెంపొందుతుందని జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, ఎంపీపీ రామమూర్తిలు అన్నారు. మంగళవారం స్థానిక వెలుగు కార్యాలయంలో శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నెలరోజులపాటు గ్రామాల్లో నిర్వహించిన పోషకాహారా వారోత్సవాలను పురస్కరించుకొని మండల స్థాయిలో నిర్వహించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు తయారుచేసిన వివిధ రకాల పోషక పదార్థములను ప్రదర్శన ఏర్పాటుచేశారు. జెడ్పిటీసీ మాట్లాడుతూ ఇరవైయేళ్లకు పూర్వం వరకు సంప్రదాయ ఆహార ధాన్యాలు, సజ్జలు,రాగులు, కొర్రలు, సామలు, వరి మనుషులచే నూర్పిడిచేసి తయారుచేసిన బియ్యం ను తినేవారన్నారు. ప్రస్తుతం రసాయనిక మందులు పిచికారి, యంత్రాల ద్వారా నూర్పిడి చేస్తుండడంతో మానవుడికి అవసరమైన పోషక విలువలు అందడంలేదన్నారు. తద్వారా మహిళలల్లో అధికశాతం రక్తహీనత తో ఇబ్బందులు పడుతున్నారన్నారు.

 

 

ప్రభుత్వం శిశు సంక్షేమ శాఖ ద్వారా అందించే పోషక ఆహారాలను సకాలంలో అర్హులందరికి అందజేసి గ్రామీణ ప్రాంతాల పిల్లల ఆరోగ్యం, సంక్షేమం పట్ల కృషిచేయాలని కార్యకర్తలను సూచించారు. గర్భవతులు, బాలింతలు, కిషోర బాలికలకు ప్రభుత్వం చే మంజూరైన పౌష్టిక ఆహారాన్ని సక్రమంగా అందజేయాలని, వాటిని తినడం వలన కలిగే ప్రయోజనాలను వివరించి అవగాహన కల్పించాలన్నారు. కేంద్రాల్లో పిల్లలకు తల్లి ప్రేమ లా ఆదరించి వారికి ఆట పాటలతోపాటు విద్యా బోదన చేయాలని సూచించారు.అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిథులకు ఐసీడిఎస్‌ సిబ్బంది చే సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్‌ రవిచంద్రారెడ్డి, వైస్‌ ఎంపీపీ నరసింహులు యాదవ్‌, ఎంపీటీసీ రూపారేఖ,సర్పంచ్‌ వరుణ్‌ భరత్‌, డాక్టర్‌ పవన్‌కుమార్‌,ఏసీడిపిఓ సరళాదేవి,ఏపిఎం నర్వోత్తమరెడ్డి, సూపర్‌వైజర్లు మాధవీలత,సులోచన, తదితరులున్నారు.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Childhood is like the foundation for a hundred years of life

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page