ఆటవీ సిబ్బంది ర్యాలీ

0 8,865

మంచిర్యాల  ముచ్చట్లు:

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా  మండలం ని చింతపల్లి చెక్ పోస్టు నుండి జన్నారం టీడీసీ కేంద్రం వరకు అటవీ సిబ్బంది తో భారీ ర్యాలీ నిర్వహించిరూ..అటవీ అధికారులు మాట్లాడుతూ అమృత్ మహోత్సవ్ లో భాగంగా పులుల సంరక్షణ కోసం చేపట్టిన ఈ ర్యాలీ ఆన్ వీల్స్ యాత్ర ఈ నెల 25 న నాగార్జున సాగర్ లో ప్రారంభం అయి 27 న మంచిర్యాల జిల్లా కు చేరిందని అని తెలిపారు.మనకు స్వతంత్రం వచ్చి  75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ర్యాలీ ని నిర్వహించమని తెలిపారు.. మనం అందరం కలసి కట్టుగా పట్టుదలతో పని చెయ్యాలని మన టైగర్ రిజర్వ్ కు కి మంచి పేరు తేవాలని ఇక్కడున్న  అధికారుల కు తెలిజేశారు..పులుల సంఖ్య పెరిగితే  అడవులు బాగా పెరుగుతాయని, తద్వారా వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నారు. అడవుల్లో గడ్డిని పెంచి శాఖాహార జంతువుల సంఖ్యను పెరిగేలా చేస్తున్నామని,ఫలితంగా పులి ఆవాసానికి తగిన పరిస్థితులు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డిపిటి వినోద్ కుమార్,జిల్లా అటవీ అధికారిని శివాని డోంగ్రే,  ఎఫ్డిఓ మాధవరావు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Forest staff rally

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page