మరోసారి పెరిగిన చమురు ధరలు

0 9,677

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

దేశంలో ఇంధన​ ధరలు మరోసారి పెరిగాయి.లీటర్ డీజిల్​పై 24 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.దేశంలో డీజిల్​ ధరల పెంపు కొనసాగుతోంది. సోమవారం.. దిల్లీలో లీటర్​ డీజిల్​పై 24 పైసలు పెరిగింది.ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.దీంతో దిల్లీలో లీటర్​ డీజిల్​ ధర రూ. 89.33కు చేరుకుంది.ముంబయిలో లీటర్​ డీజిల్​ ధర 25 పైసలు పెరిగి రూ. 96.9కు చేరగా.. లీటర్​ పెట్రోల్​ ధర రూ. 107.27 వద్ద కొనసాగుతోంది.కోల్​కతాలో లీటర్​ డీజిల్​పై 24 పైసలు పెరగడం వల్ల ధర రూ. 92.38కు చేరింది. లీటర్​ పెట్రోల్​ రూ.101.64గా ఉంది.చెన్నైలో లీటర్​ డీజిల్​ 23 పైసలు పెరిగి రూ. 93.90 వద్ద కొనసాగుతోంది. లీటర్​ పెట్రోల్​ 98.97గా ఉంది.తెలుగు రాష్ట్రాల్లో…హైదరాబాద్​లో లీటర్ డీజిల్​ ధర 26 పైసలు పెరిగి రూ.97.43 వద్ద కొనసాగుతోంది. పెట్రోల్ ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది.వైజాగ్​లో లీటర్​ డీజిల్​ ధర 25 పైసలు పెరిగి రూ.97.90 వద్దకు చేరింది. పెట్రోల్ ధర రూ.106.23గా ఉంది.గుంటూరులో డీజిల్​ లీటర్​పై 25 పైసలు పెరిగి.. రూ.99.13 వద్దకు చేరింది. పెట్రోల్ ధర లీటర్​ రూ.107.5 వద్ద స్థిరంగా ఉంది.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Once again rising oil prices

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page