ప్రజలు అప్రమత్తంగా వుండాలి

0 8,566

మెదక్ ముచ్చట్లు:

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో నదులు వాగులు పొంగిపొర్లుతున్నాయిని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.  మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల దుర్గ భవాని ఆలయం ముందు పొంగిపొర్లుతున్న మంజీర నదికి ఆమె శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ గులాబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కురుస్తున్న వానలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు వాగులు వంకలు దాటే ప్రయత్నం, సాహసం చేయరాదని సూచించారు తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని ఆమె కోరారు దుర్గామాత పాదాల చెంత ప్రవహించే మంజీరా నది వల్ల  ఎవరికి ఎలాంటి  ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అమ్మవారి దీవెనలు మనందరిపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి మరియు  టిఆర్ఎస్ నాయకులు రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు సోములు. జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి. మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ చంద్రపాల్ పాపన్నపేట మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:People need to be vigilant

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page