ఎస్ వి ఆర్ స్కూల్ నందు పిట్ ఇండియా ఫ్రీడం రన్2.0 కార్యక్రమం

0 9,259

నెల్లూరు ముచ్చట్లు:

 

నెల్లూరు నగరంలోని స్థానిక జాకీర్ హుస్సేన్ నగర్లో లో ఉన్న ఎస్ వి ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మంగళవారం పిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి ఆకుల మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవడమని నెహ్రూ యువ కేంద్ర డిస్ట్రిక్ట్ యూత్ ఆఫిసర్ ఆకుల మహేంద్ర రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఫిట్ ఇండియా 2.0 కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు.. ఈ సందర్భంగా పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.మురళీమోహన్ రాజు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి కనీసం అరగంట వ్యాయామం లేదా ఆటలు ఆడడం ద్వారా శారీరక,మానసిక రుగ్మతలు నయం చేసుకోవచ్చునని తెలియ చేశారు. అనంతరం విద్యార్థులచే పిట్ ఇండియా రన్ ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో సెట్నెల్ సూపరెండెంట్ గయాజ్, స్కూల్ కరెస్పాడెంట్ అందే శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ బి.రమేష్ బాబు,అంకబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags; Pit India Freedom Run 2.0 program at SVR School

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page