త్యాగధనుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి

0 8,789

-యువసేన అధ్యక్షులు కాసారపు అరవింద్ గౌడ్
-భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు
-విద్యార్థులకు యూనిఫామ్, దుప్పట్ల పంపిణీ

జగిత్యాలముచ్చట్లు:

- Advertisement -

స్వాతంత్ర్య సమరయోధుడు షహీద్  భగతసింగ్114 వ జయంతి వేడుకలను భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని దరూర్ క్యాంపులోని వాల్మీకి ఆవాసంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి ఆముద లింగారెడ్డి హాజరై మాట్లాడుతూ మాట్లాడుతూ భగత్ సింగ్ తోపాటు సుఖ్దేవ్, రాజ్ గురులు స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ పాలకులను ముప్పుతిప్పలు పెట్టారని, భగత్ సింగ్ యుక్త వయసులో దేశ స్వేచ్చా స్వాతంత్ర్యాల కోసం సుఖ్ దేవ్, రాజ్ గురు ముగ్గురు యువకిశోరాలు లాహోర్ సెంట్రల్ జైలులో 1931 మార్చి 23 న ఉరికొయ్యలను ముద్దాడారని వారి త్యాగాలను కీర్తించారు. మహనీయుల అసమాన త్యాగాలను విస్మరించరాదని భావితరాలకు తెలియజేసే క్రమంలో చరిత్ర, పాఠ్యపుస్తకాలలో ప్రచారంలో ఉంచాలని అన్నారు. యువసేన అధ్యక్షులు కాసారపు అరవింద్ గౌడ్ మాట్లాడుతూ త్యాగధనులు షహీద్ భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురుల విగ్రహాలు పట్టణ ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయాలని స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారి భారతదేశ దాస్యశృంఖాలాల నుండి విముక్తి పరిచే క్రమంలో చేసిన వారి తెగువను త్యాగాలను గుర్తుచేశారు. దేశం కోసం యువత మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కార్యదర్శి ఎర్ర అఖిలేష్ మాట్లాడుతూ యువసేన ఆధ్వర్యంలో అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేశామని భవిష్యత్తులో ఇంకా చేస్తామని వివరించారు. అనంతరం ఆవాసంలో విద్యను అభ్యసిస్తున్న 40 మంది విద్యార్థులకు రానున్న చలికాలంను దృష్టిలో ఉంచుకొని దుప్పట్లు,యూనిఫామ్ ల పంపిణీ తోపాటు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆవాసం వార్డెన్ మల్లేశం, యువసేన నాయకులు విశాల్, అభిలాష్ , సందీప్, లక్ష్మణ్, మారుతి, భానుతేజ, సాకేత్,శ్రవణ్, సంజయ్, వాసు, మహేందర్, వినయ్, బాలకృష్ణ ,మధు, జగదీష్ తో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Statues of sacrifices should be erected

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page