నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు

0 9,280

రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు:

 

గులాబ్ తుఫాన్ కారణంగా సిరిసిల్ల పట్టణంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ ,వెంకంపేట, పాతబస్టాండ్ ,సంజీవయ్యనగర్, లోతట్టు ప్రాంతాలు మళ్లీ నీటమునిగాయి. కొద్ది రోజుల క్రితమే కురిసిన భారీ వర్షానికి ఇండ్లు నీట మునిగి చాలామంది నిస్సహాయులుగా మారగా సిరిసిల్ల నియోజకవర్గ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక చర్యలు చేపట్టారు. రెండు రోజుల క్రితమే తుఫాన్ హెచ్చరికతో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను అప్రమత్తం చేసి కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం నుండి కురుస్తున్న  వర్షం సాయంత్రం వరకు జోరందుకోగా తిరిగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల వాసులను పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు. సిరిసిల్ల కరీంనగర్ చెరువు కట్ట వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రోడ్డుపైనే  దిగబడి పోగా బస్సును బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.రాత్రి ఇలానే వర్షం కొనసాగితే చెరువు కట్ట తెగి పోయి శాంతినగర్ మరియు చిన్న బోనాల వాసులకు మరింత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Submerged lowlands

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page