తిరుపతి ప్రైవేట్ పరం

0 9,666

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతి రైల్వేస్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం లీజుకు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాల్సిందిపోయి టెండర్లు పిలిచి ప్రైవేట్‌ వారికి అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. విజయవాడ తరహాలో తిరుపతినీ ప్రైవేట్‌ వారికి ధారాదత్తం చేయనుంది. దీనివల్ల తిరుపతి వచ్చే భక్తులపై భారాలు పడనున్నాయి. ముందుగా రైల్వే సంస్థకు చెందిన రైల్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి అప్పగించి అభివృద్ధి చేసిన అనంతరం టెండర్లు పిలవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే కమర్షియల్‌ ఆఫీసర్‌ ప్రదీప్‌ తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భారతదేశాన్ని అమ్మకానికి పెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కారు చౌకగా కట్టబెడుతోంది. మరోవైపు నేషనల్‌ మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌ పేరుతో వచ్చే నాలుగేళ్లలో ఆరు లక్షల కోట్ల రూపాయలను సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా ప్రభుత్వ ఆస్తులను దీర్ఘకాలం లీజుకు ఇచ్చేందుకు రంగం చేసింది. తిరుపతి రైల్వే స్టేషన్‌ను కూడా ఈ జాబితాలో చేర్చింది. దేశంలో ఆదాయాన్ని సమకూర్చే రైల్వే స్టేషన్లలో తిరుపతి ఒకటి. రోజుకు రూ.35 లక్షల ఆదాయం ఆర్జిస్తూ లాభాల బాటలో నడుస్తోంది. తిరుపతి రైల్వే స్టేషన్లో భాగంగా ఉన్న సిఆర్‌ఎస్‌, తిరుచానూరు, తిరుపతి వెస్ట్‌ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు.

 

 

 

- Advertisement -

ఈ రైల్వేస్టేషన్‌ నిర్వహణను తాము భరించలేమంటూ టికెట్ల రిజర్వేషన్‌ తప్ప ప్లాట్‌ ఫారాలు, పార్కింగ్‌ స్థలాలు, షాపులు, లాకర్‌ రూమ్‌లు, విశ్రాంతి భవనాలు, క్యాంటీన్లు తదితర అన్నింటినీ ప్రైవేట్‌ వారికి అప్పగించనున్నారు. శ్రీవారి భక్తులు రైలు మార్గంలో రోజుకు 40 వేల మంది, ఇతర మార్గాల్లో ఐదు వేల నుంచి పది వేల మంది తిరుపతికి వచ్చి వెళ్తుంటారు. వివిధ రాష్ట్రాలను కలుపుతూ 26 ఎక్స్‌ప్రెస్‌, 12 ప్యాసింజర్‌ రైళ్లు తిరుపతికి భక్తులను, ప్రయాణికులను చేరవేస్త్తున్నాయి.
‘కార్గో’ రైలు ద్వారా మామిడి పండ్లు, టమాట, పాలు, కూరగాయలు తదితరాలు ఎగుమతి అవుతున్నాయి. గూడ్స్‌ల ద్వారా నెలకు రెండు కోట్ల రూపాయలకుపైగా ఆదాయం సమకూరుతోంది. తిరుపతి రైల్వే స్టేషన్‌ను వరల్డ్‌ క్లాస్‌ స్థాయికి తీసుకొస్తామని యుపిఎ ప్రభుత్వ హయాంలో అప్పటి రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని సోనియా గాంధీ హామీ ఇచ్చారు. అవి కార్యరూపం దాల్చలేదు. మోడీ హయాంలో ఈ స్టేషన్‌ను ప్రైవేట్‌ వారి చేతుల్లోకి పెట్టడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Tirupati Private Param

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page