పారిశుధ్య పనులను కార్మికులు కలిసి కట్టుగా 100 శాతం పూర్తి చేయాలి-మున్సిపల్ చైర్ పర్సన్, కమీషనర్

0 8,535

జగిత్యాల ముచ్చట్లు:

:పట్టణంలో గత రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఏర్పడిన పారిశుధ్య పనులను కార్మికులు కలిసి కట్టుగా 100 శాతం పూర్తి చేయాలని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్. భోగ శ్రావణి, కమీషనర్ జి.స్వరూప రాణి సూచించారు.మంగళవారం స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో మున్సిపల్ చైర్ పర్సన్ , కమిషనర్ ఆధ్వర్యం
లో పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  చైర్ పర్సన్ డా. బోగ శ్రావణి హజరై ఆమే మాట్లాడుతూ పట్టణ పారిశుధ్యమునకు వెన్నుముక పారిశుధ్య కార్మికులేనని ,వారి సేవలు అనిర్వచానమని కొనియాడారు.ప్రస్తుత కరోనా, వర్షా కాలం సీజనల్ కాలంలో పారిశుద్ధ్య కార్మికులు చాలా బాగా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడాతూ ,వారికి
కృతఙ్ఞతలు తెలిపారు..
పట్టణ పారిశుధ్య పనులను కార్మికులు కలిసి కట్టుగా 100 శాతం పూర్తి చేయాలని, జగిత్యాల పట్టణానికి గుర్తింపు తీసుకురావాలని దిశ నిర్దేశం చేశారు. కార్మికులందరికి యూనిఫార్మం అందిస్తామని చైర్ పర్సన్ తెలిపారు.ఆనంతరం
కమిషనర్ మాట్లాడుతూ కార్మికులు అందరూ కృషి చేస్తూ, పట్టణ పారిశుధ్యానికి మెరుగు పరచాలని, ఇంటి నుండే చెత్తను తడి మరియు పొడిగా వేరు చేసి మున్సిపల్ వాహానానికి అందిచాలని ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు పారిశుధ్య కార్మికులందరు చాలా కష్టపడుతున్నారని, అయితే నిర్దిష్ట సమయములొనే ప్రణాళిక రూపొందించుకొని పని పూర్తి అయ్యేలా చర్యలు తీసుకొనుటకు జవాన్లను ఆదేశించారు. కార్మికులకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా మా దృష్టికి తీసుకురావాలని కార్మికులు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్థామని తెలిపారు.  పట్టణ పరిశుభ్రంగా ఉంచే భాద్యత మనందరిదిని కావున ప్రతి కార్మికుడు బాధ్యతగా 100 శాతం విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రతి నెల ఉత్తమ కార్మికులని గుర్తించి సత్కరించడం జరుగునని తెలిపారు.ఈ సమావేశంలో సానిటరి ఇన్స్పెక్టర్లు అశోక్, రాము జవాన్లు, కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Workers must complete 100 percent of the sanitation work together — Municipal Chairperson, Commissioner

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page