అల్లూరి కాంప్లెక్స్ వివాదం

0 7,559

నరసాపురం ముచ్చట్లు:

స్థానిక అల్లూరి సత్యనారాయణ మున్సిపల్ కాంప్లెక్స్ ని పడగొట్టి కొత్త కాంప్లెక్స్ కట్టడానికి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు సన్నాహాలు చేస్తున్న మూలంగా కాంప్లెక్స్ పడగొట్టడానికి వీల్లేదని కేవలం రిపేర్లు చేసి కాంప్లెక్స్ లో వ్యాపారం చేస్తున్న వారికి మళ్లీ షాపు ఇవ్వాలని అటు తెలుగుదేశం బిజెపి జనసేన నాయకులు డిమాండ్ చేస్తుండటంతో ఇరు పార్టీ నాయకులు ఒకరినొకరు దూషించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నరసాపురం మున్సిపల్ చైర్ పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణ వైసిపి నాయకులు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఉనికిని కాపాడుకోవడం కోసం వ్యాపారస్తులు నాశనం చేయడం కోసం వ్యాపారస్తులు రెచ్చగొట్టి కుటిల రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.  ఎమ్మెల్యే ప్రసాద్ రాజు వ్యాపారస్తులు ని బాగు చేయాలనే ఉద్దేశంతోటెక్నికల్ గా కాంప్లెక్షన్ ప్రమాద పరిస్థితులలో ఉండడం మూలంగా కాంప్లెక్స్ ను  పడగొట్టి నూతనంగా నిర్మించి గతంలో వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారస్తులకు షాపు ఇచ్చే లాగా పరిష్కారం చేస్తున్నారని, ఈ విషయాన్ని రాజకీయం చేసి నానా హంగామా చేయడం తెలుగుదేశం పార్టీకి సమంజసం కాదని అన్నారు, ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కామన బుజ్జి ఏడిది కోట సత్యనారాయణ, బర్రె జయరాజు,తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Alluri Complex Controversy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page