చెన్నూరులో ముంపు బాధితుల అందోళన

0 7,596

 

మంచిర్యాల   ముచ్చట్లు:

- Advertisement -

మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో మునిగిపోయిన పంటపొలాలకు వెంటనే నష్ట పరిహారం చెల్లించి,తమ భూములను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించి నిరసనకు దిగారు.. ఆరుగాలం కష్టపడి పంటలు సాగుచేస్తే బ్యాక్ వాటర్ తో పంటలు మునిగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు..ఈ ఏడాది మూడు సార్లుబ్యాక్ వాటర్ తో పంటలు నీట మునిగాయని పట్టించుకున్న నాధుడే కరువయ్యారని రైతులు మండిపడ్డారు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తే తమ పంటలకు నీరు అందుతాయని ఆశలు పెట్టుకున్నామని,ఆ నీళ్లే తమ పంట పొలాలు ముంచి నష్టాల పాలు చేస్తాయని అనుకోలేదని రైతులు పేర్కొన్నారు..కాళేశ్వరం నీళ్లు మాకు “కన్నీళ్లే”మిగిలిస్తున్నాయని వారు తెలిపారు.. వీరికి స్థానిక బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు.. అనంతరం స్థానిక తహశీల్దార్ కి వినతిపత్రం అందజేశారు…

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Concern of flood victims in Chennur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page