3.7 శాతం పెరిగిన సైబర్‌ క్రేమ్‌ సైబర్‌ నేరాల రేటు

0 8,594

-సామాజిక మాధ్యమం ద్వారా లైంగిక దోపిడి

న్యూ డిల్లీ ముచ్చట్లు:

- Advertisement -

ఇటీవల విడుదల చేసిన నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో డేటా ప్రకారం సైబర్‌ నేరాల రేటు (లక్ష జనాభాకు) 2019తో పోలిస్తే 2020లో 3.7 శాతం పెరిగింది. లైంగిక వేధింపులకు సంబంధించిన నేరాలు సైబర్‌క్రైమ్‌లో రెండవస్థానంలో ఉన్నట్టు బ్యూరో నివేదికలు చూపుతున్నాయి. అమెరికాలోని వార్విక్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం, కరోనా సమయంలో అంతటా సైబర్‌ నేరాలు వేగంగా పెరిగాయి. ఇంట్లో ఉండటం వల్ల ప్రజలు మొబైల్, కంప్యూటర్లలో మరింత చురుకుగా మారారు. దీనితో పాటు ఇంటర్నెట్‌ దుర్వినియోగం కూడా పెరిగింది. ఇటీవల తెలంగాణలోని ఓ రెస్టారెంట్‌ వాష్‌రూమ్‌లో ఫోన్‌ కెమరా రహస్య ప్రదేశంలో ఉంచి, రికార్డ్‌ చేస్తున్నట్టు గుర్తించారు. సుప్రీంకోర్టు న్యాయవాది నిపుణ్‌ సక్సేనా ఈ సైబర్‌ నేరాల గురించి మాట్లాడుతూ ‘భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 354(సి) దీనిని నేరంగా పరిగణిస్తుంది.ఈ నేరం ఎలక్ట్రానిక్, డిజిటల్‌ గాడ్జెట్ల ద్వారా జరుగుతుంది. మహిళల వ్యక్తిగత క్షణాలు ఒక పరికరంలో రికార్డ్‌ చేస్తే, అది నేరంగా పరిగణించబడుతుంది. మహిళల వ్యక్తిగత చిత్రాలు స్టోర్‌ చేయడం, షేర్‌ చేయడం, ప్రసారం చేయడం.. అన్నీ నేరం పరిధిలోకి వస్తాయని, సెక్షన్‌ 292, సెక్షన్‌ 294 కు వర్తిస్తాయని వారు పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 2000 ప్రకారం సెక్షన్‌ 67, సెక్షన్‌ 67(ఎ) కింద శిక్షలను అమలుచేసే నిబంధన కూడా ఉంద’ని వివరించారు. సోషల్‌ మీడియాలో అపరిచితులతో చేసే స్నేహాల పట్ల ఎప్పుడూ అప్రమత్తత అవసరమనే విషయాన్ని నిపుణులు స్పష్టం చేస్తూనే ఉన్నారు. ‘సెక్స్‌టోర్షన్‌తో సంబంధం గల ముఠా మిమ్మల్ని అశ్లీల వీడియోలు చూడటానికి ఆహ్వానిస్తుంది. మీరు ఆ వీడియోల పట్ల ఆసక్తి చూపినప్పుడు ఆ గ్యాంగ్‌ మీకు అలాంటి వీడియోలనే చూపించడం మొదలుపెడుతుంది.మానసికంగా మిమ్మల్ని ప్రలోభపెట్టి మీ నుంచి వీడియోలను సేకరిస్తుంది. తర్వాత వాటిని లీక్‌ చేస్తానని బెదిరించి, బ్లాక్‌ మెయిల్‌కు దిగుతుంది’ అని చెబుతున్నారు. సర్వత్రా డిజిటల్‌మయమైన ఈ కాలంలో అమ్మాయిలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, నేరాలకు అడ్డుకట్టవేయడానికి ముందు నేరాలకు అవకాశం ఇవ్వరాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Cybercrime crime rate rises to 3.7%

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page