సిబ్బందికి డోపింగ్ టెస్టులు

0 7,480

న్యూఢిల్లీ ముచ్చట్లు:

విమానాల్లో ప్రయాణించే వారికి తనిఖీలు నిర్వహించడం సాధారణమే. అయితే.. సిబ్బందికి కూడా మాదక ద్రవ్యాల పరీక్షలు చేసేందుకు ప్రభుత్వ విమానయాన సంస్థ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. విమానాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి, రాకపోకలను నియంత్రించే ఉద్యోగులకు వచ్చే ఏడాది జనవరి 31 నుంచి డోప్‌ పరీక్షలు చేయనున్నట్లు వెల్లడించింది. మనుషుల మానసిక, శారీరక పరిస్థితులపై ప్రభావం చూపించే గంజాయి, కొకెయిన్‌ వంటి మాదకద్రవ్యాలకు సిబ్బంది దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్‌ వినియోగం విస్తరిస్తోందని.. ముఖ్యంగా విమానాల్లో ప్రయాణించేవారే పట్టుబడుతున్నారని అధికారులు వెల్లడించారు. విమానాల్లో వీటి వినియోగం, లభ్యత ప్రయాణికుల భద్రతపరంగా దీనిని తీవ్రంగా పరిగణించాల్సిన విషయంగా సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ పేర్కొన్నారు.ఈ మేరకు డీజీసీఏ చీఫ్‌ అరుణ్‌ కుమార్‌ ఉత్తర్వులను జారీ చేశారు. విమానాయన ఉద్యోగులందరికీ ఈ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. ఒకవేళ ఉద్యోగులు ఈ పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరిస్తే వారిని విధుల నుంచి తొలగిస్తారు. డోప్‌ పరీక్షల అనంతరం వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. డోప్‌ పరీక్షల్లో పట్టుబడితే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించే అవకాశముంది.
మరో నెల పొడిగింపు
గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి విజృంభించగా, ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఇక దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగుతున్న వేళ అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కమర్షియల్‌ విమాన సర్వీసుల రద్దును అక్టోబర్‌ 31 వరకూ కొనసాగించనున్నట్టు పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) వెల్లడించింది. కార్గో విమానాలతో పాటు ఎంపిక చేసిన కొన్ని రూట్లలో మాత్రం ప్రయాణికుల విమానాలు నడపనున్నట్టు తెలిపింది. కరోనా కట్టడిలో భాగంగా గతేడాది మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సర్వీసులను నిలిపివేయగా.. ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేస్తూ దశలవారీగా సెప్టెంబర్‌ 30 వరకూ పొడిగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్టోబర్‌ నెలాఖరు వరకు విమానాల రద్దు నిర్ణయాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటనలో తెలిపింది.మరోవైపు, అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్‌, ఫ్రాన్స్‌, మాల్దీవులు, నెదర్లాండ్స్‌, జర్మనీ, ఖతార్‌ సహా దాదాపు 25 దేశాలతో భారత ప్రభుత్వం విమాన సర్వీసులు నడిపేందుకు ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆయా దేశాలకు నడవనున్నాయి.కాగా, కోవిడ్‌ నేపథ్యంలో అన్ని రవాణాలతో పాటు విమానాలను సైతం నిషేధించింది. ఒక వైపు లాక్‌డౌన్‌, కఠినమైన ఆంక్షలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కారణంగా ప్రస్తుతం భారత్‌లో పాజిటివ్‌ కేసుల భారీగానే తగ్గుముఖం పట్టాయి. దేశంలో అన్ని రంగాలు తెరుచుకుని తమతమ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, విమాన సర్వీసులు మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా మరోసారి విమానాల రద్దు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది డీజీసీఏ.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Doping tests for staff

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page