పోసానికి వ్యతిరేకంగా నిరసనలు

0 8,766

విజయవాడ  ముచ్చట్లు:

సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆందోళన కొనసాగిస్తున్నారు. అమరావతి తాడేపల్లి ప్రాంతంలోని గుండిమెడలో సినీనటుడు పోసాని క్రిష్ణ మురళి దిష్టి బొమ్మ దహనం చేశారు ఆందోళనకారులు. పవన్ కళ్యాణ్ గురించి మరక్కొ మాట మాట్లాడితే, పోసాని భవిష్యత్ లో కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పవన్ అభిమానులు హెచ్చరిస్తూ నినాదాలు చేశారు.మరోవైపు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి వెంకట హరిరామజోగయ్య ఫైర్ అయ్యారు. ఇప్పటికే లేఖ రిలీజ్ చేసిన జోగయ్య..  పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్న వైసీపీ మంత్రులు వెనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ఆయన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆరోపించారు.ముఖ్యమంత్రి కాపులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ని ఆరాధించే కాపుల సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామని ఆయన శపథం చేశారు. పోసాని కృష్ణ మురళి ఒక జోకర్ అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ చేగొండి వెంకట హరిరామజోగయ్య కొట్టిపారేశారు.
పోసాని పై టీడీపీ సంచలన వ్యాఖ్యలు
నటుడు పోసానిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్ వికృత క్రీడకు పెయిడ్ అర్టిస్ట్‌గా పోసాని మారిపోయాడని విమర్శించారు. సామాన్యులు వినలేని భాషలో వైసీపీ నేతలు మాట్లాడుతుంటే జగన్ రెడ్డి ఆనందంలో మునిగి తేలుతున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పోసాని కామెంట్ల నేపథ్యంలో అచ్చెన్న ఇవాళ అమరావతిలో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.పోసాని బూతులు సభ్య సమాజం తలదించుకునే విధంగా లేవా? జుబుత్సాకరమైన భాషను ప్రయోగించి సంస్కృతి సాంప్రదాయాలను మంటగల్పుతున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి పోసాని కృష్ణ మురళీ చేత ప్రశాంత్ కిషోర్ టీం మాట్లాడిస్తుంటే జగన్ రెడ్డి ఎందుకు బహిరంగంగా వారించలేదు. సామాన్యులు వినలేని.. మాట్లాడలేని భాషలో వైసీపీ నేతలు మాట్లాడుతుంటే తాడేపల్లిలో జగన్ రెడ్డి ఆనందంలో మునిగితేలుతున్నారు. మద్యం షాపుల దగ్గర చీప్ లిక్కర్ తాగిన తాగుబోతులు కూడా ఈ విధంగా మాట్లాడరేమో?” అని అచ్చెన్న అన్నారు.2 లక్షల కోట్ల డ్రగ్స్ మాఫియాకు ఆంధ్ర రాష్ట్రం అడ్డాగా మారింది. మాఫియాలో ఆఫ్ఘన్ టెర్రరిస్టులు కూడా కుమ్మక్కై దేశ ద్రోహానికి పాల్పడుతున్నారు. ధరలు పెంచడం, దోపిడీ పాల్పడటం వంటి వాటితో ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో వైకాపా నేతలు కుల, మత, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు. రాజకీయ విమర్శలకు బూతులు కాకుండా ప్రజా స్వామ్య స్పూర్తిని కొనసాగించేలా మాట్లాడకపోతే సరైన సమయంలో ప్రజలు మీకు గుణపాఠం చెబుతారని మర్చిపోకండి.” అంటూ అచ్చెన్నాయుడు వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Protests against Posani

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page