రాయలసీమ సాహితీ రత్నం డాక్టర్ ఎం వీ రమణా రెడ్డికి తిరుపతి ఎమ్మెల్యే భూమన నివాళి

0 5,785

తిరుపతి ముచ్చట్లు:

ప్రముఖ రచయిత, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం వీ రమణా రెడ్డి మృతికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.  రాయల సీమ సాహితీరత్నం డాక్టర్ రమణా రెడ్డి మన మధ్య లేకపోవడం తీరని లోటు.  బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మాటకు నిలువెత్తు నిదర్శనం డాక్టర్ ఎం.వి.రమణారెడ్డి వైద్యంలో పట్టభద్రుడైనా.. తెలుగు,  ఇంగ్లీష్ సాహిత్యం, సంగతం , సినీమా కళల్లో  ఆయన లెక్కకు మించి గౌరవ డాక్టరేట్లు పొందారు.  డాక్టర్ ఎం వీ రమణా రెడ్డి తన తుది శ్వాస వదిలే దాకా కాలాన్ని  విడిచిపెట్టని మన కాలం వీరుడు.   డాక్టర్ ఎం వీ రమణా రెడ్డి రెక్కలు చాచిన పంజరం, చివరకు మిగిలేది ( గాన్ విత్ ద విండ్) వంటి ప్రపంచ ప్రఖ్యాత నవలలను అనువదించి,  తెలుగు పాఠకులకు అందించిన ధన్యజీవి అయన అని అన్నారు.  డాక్టర్ ఎం వీ రమణా రెడ్డి ఇటీవల రాసిన ప్రపంచ చరిత్ర ను చదివి  ఆయన జ్ఞానానికి అబ్బురపడి, కాస్త జ్ఞానాన్ని   సంపాదించుకున్న  వారిలో నేనూ ఒక్కడినే.  డాక్టర్ ఎం వీ రమణా రెడ్డి కి ఇదే నా అశ్రు నివాళని అన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Tirupati MLA Bhumana pays tribute to Rayalaseema Sahitya Ratnam Dr. MV Ramana Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page