వైద్య శిబిరాలు ఏర్పాటు కు స్వచ్ఛంద సేవలు ముందుకు రావాలి- ఎమ్మెల్యే డాక్టర్ సంజాయ్ కుమార్

0 8,792

జగిత్యాల ముచ్చట్లు:

ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా (నేషనల్ హార్ట్ డే) రీసెర్చ్ సొసైటీ పర్ స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా, సేవా భారతి జగిత్యాల శాఖ సంయుక్తంగా పట్టణంలోని ఉమా శంకర్ గార్డెన్స్ లో మధుమేహ నిర్దారణ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సేవా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని అన్నారు.
సేవా భారతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బీమానాతి శంకర్ తోటి వైదులుగానే కాగా సేవా కార్యక్రమాలతో వారితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. మన దేశంలో డయాబెటిక్ సమస్య రోజు రోజుకు తీవ్రం అవుతుందని, ప్రపంచంలో చైనా తర్వాత మన దేశమే మధుమేహ వ్యాధిగ్రస్థులలో రెండవ స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ప్రజలు శారీరక శ్రమ, ఆహార అలవాట్లు, వ్యాయామం, యోగా ద్వారా ఈ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చని అన్నారు.
రోగం వచ్చేదానికంటే దాన్నీ రాకుండా నివారణకె అధిక ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలో 18 ప్రైమరీ హెల్త్ కేంద్రాలు ఉన్నాయని,ప్రతి రోజు షుగర్ తో పాటు 57 పరీక్షలు గుండె, కొవ్వు, తైరాయిడ్ ఇలా 57 పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారన్నారు. ఉచిత పరీక్షలు చేయించుకోవాలనుకునే వారి కోసం దరూర్ క్యాంపులో 2 కోట్ల తో డయగ్నిస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించామని ఉచిత పరీక్షలు చేయటంతో పాటు ఆన్లైన్ ద్వారా మెసేజ్ రూపంలో ఫలితాలు వస్తాయని తెలిపారు.
వైరాలజీ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేయటం జరిగిందని. ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేయలేదని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి పని చేయటం ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ధనిక దేశాల్లో కూడా స్వచ్ఛంద సంస్థల భాగం గొప్పదని, బీద, మధ్యతరగతి ప్రజలకు దాతృత్వ సంస్థల సేవలు అవసరమని, ఈనాడు సేవా భారతి మధుమేహ ఉచిత నిర్దారణ శిబిరం ఏర్పాటు చేసిన వైద్యులు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి, ఐ యం ఏ జగిత్యాల అధ్యక్షులు డాక్టర్ నరహరి, పట్టణ సేవ భారతి అధ్యక్షులు జిడిగే పురుషోత్తం, అశోక్ రావు, సంపూర్ణా చారి, స్థానిక కౌన్సిలర్ లు అల్లే గంగసాగర్, రాజ్ కుమార్, నాయకులు భోగ ప్రవీణ్, కత్రోజ్ గిరి, కూతురు శేఖర్, ప్రతాప్, రాజు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Voluntary services should come forward to set up medical camps- MLA Dr. Sanjay Kumar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page