పేదల అభ్యున్నతికే ప్రభుత్వ పథకాలు- షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్

0 8,760

రంగారెడ్డి ము చ్చట్లు:

ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతుందని వాటిని నిరుపేదలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కోరారు. గురువారం ఫరూక్ నగర్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో 114 మందికి రూ. 1కోటి 14లక్షల 13వేల 224  కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. అదేవిధంగా 126 మంది లబ్ధిదారులకు 47 లక్షల 50వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,  సీఎం సహాయ నిధి పథకాలు ఒక వరం లాంటివన్నారు. కళ్యాణలక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన పథకం ప్రారంభించిందని, 2017 మార్చి 13న ప్రవేశపెట్టిన 2017-18 తెలంగాణ బడ్జెట్ లో ఈ పథక ఆర్థిక సాయాన్ని రూ.51వేల నుండి రూ.75,116 లకు పెంచారని అదేవిధంగా 2018, మార్చి 19న రూ.1,00,116 కు పెంచారని పథకం గురించి వివరించారు. అర్హులైన యువతులు తమ వివాహానికి నెల రోజుల ముందు మీ-సేవ కేంద్రాల నుంచి దరఖాస్తు చేసుకోవాలనీ, దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన యువతులు మాత్రమే ఈ పథకానికి అర్హులని సూచించారు. ధరఖాస్తుదారుల కుటుంబ సభ్యుల ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదని వివాహ సమయానికి అమ్మాయి వయసు 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు వస్తున్నాయని, ప్రభుత్వం పేద ప్రజలను పూర్తిస్థాయిలో అన్ని విధాల ఆదుకోవడం ఆనందాన్ని ఇస్తుందని అంజయ్య యాదవ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్, షాద్ నగర్ ఆర్డిఓ రాజేశ్వరి, జెడ్పిటిసిలు వెంకట్ రామ్ రెడ్డి, విశాల శ్రావణ్ రెడ్డి, ఎంపీపీ ఖాజా అహ్మద్ ఇద్రీస్, ఎంపీటీసీ భార్గవ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు ప్రతాప్ రెడ్డి, ఈశ్వర్ రాజు, బచ్చలి నర్సింహులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Government schemes for the betterment of the poor- Shad Nagar MLA y. Anjayya Yadav

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page