డక్కిలిలో పర్యటించిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి

0 8,794

-ఎమ్మెల్యే ఆనం తో కలిసి అభివృద్ధి పనులకు శ్రీకారం

నెల్లూరుముచ్చట్లు:

- Advertisement -

నెల్లూరు జిల్లా, డక్కిలి మండలం లో స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే
40 లక్షలతో నిర్మించిన మోడల్ సచివాలయాన్ని  మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ,తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి,మాజీ మంత్రివర్యులు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా 21 లక్షలతో నిర్మితమౌతున్న రైతు భరోసా కేంద్రం పనులను పరిశీలించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి గురుమూర్తి ,జడ్పీటిసి కలిమిలి రాజేశ్వరి ,ఎంపిపి రాజశేఖర్ ,ఎన్డీసీసీబీ డైరెక్టర్ రమణారెడ్డి ,జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ గణేష్ ,డి ఆర్ డి ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్  మరియు డ్వామా, డి పి ఓ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి బాలునికి స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సచివాలయాల నిర్మాణాల్లో వెంకటగిరి నియోజకవర్గం మొదటిస్థానంలో ఉందన్నారు. ఆరు మండలాల్లో గ్రామ కొలను గ్రామంలో పైలెట్ ప్రాజెక్ట్ గా చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ ఆలోచనలతో గ్రామస్వరాజ్యం నడుస్తోందన్నారు. గాంధీజీ కలలనను వైకాపా ప్రభుత్వం సాకారం చేస్తోందన్నారు. పార్టీలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్ సంక్షేమం అందిస్తున్నారని ఆయన సేవలను కొనియాడారు . అనంతరం డక్కిలిలో 78 లక్షలతో జరుగుతున్న గ్రామ కొలను పనులను  మంత్రి బాలినేని , ఆనం రామనారాయణ రెడ్డీ పరిశీలించారు. తొలుత దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Minister Balineni Srinivas Reddy visiting Dakki

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page