చెక్కర కర్మాగారాల నిర్వహాణపై మంత్రి వర్గ ఉపసంఘం భేటీ

0 7,576

విజయవాడ ము చ్చట్లు:

రాష్ట్రంలోని చెక్కర కర్మాగారాల నిర్వాహణ , పునరుద్ధరణ ఇతర అంశాలపై  గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్  సమావేశమైయారు,. న మంత్రులు కురసాల కన్నబాబు , బొత్స సత్యనారాయణ , మేకపాటి గౌతమ్ రెడ్డి , స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య , డైరెక్టర్ అఫ్ సుగర్స్ వెంకట్రావు తదితరులు హజరయ్యారు. వర్చువల్ గా చెరకు ఫ్యాక్టరీలు, రైతుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. చక్కెర ఫ్యాక్టరీలలో చక్కెర అమ్మకాలు సహా  ఉద్యోగాల జీతాల చెల్లింపు, వీఆర్ఎస్ అమలు, ఇతర సమస్యలపై ప్రధానంగా చర్చించారు. విజయదశమికి చెరకు రైతులు, చక్కెర ఫ్యాక్టరీలలోని ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రులు అన్నారు. హై కోర్టు నుంచి స్టే తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఉన్నతాధికారులను అభినందించారు. చెరకు రైతులు, చక్కెర ఫ్యాక్టరీల ఉద్యోగుల జీతాల బకాయిలపై ప్రత్యేకంగా చర్చించారు. ముఖ్యమంత్రితో సమావేశమై ఆ తర్వాత అన్నింటిపై స్పష్టత తీసుకురావాలన్న యోచనలో మంత్రులు వున్నట్లు సమాచారం. టెండర్ అనంతరం , అక్టోబర్ 5 తర్వాత మరో భేటీకి మంత్రుల నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాదికి గానూ చోడవరం, తాండవ సహా పలు చక్కెర కర్మాగారాలకు సంబంధించిన బకాయిల మొత్తం  రూ.70 కోట్లని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీల బకాయిల విలువే అత్యధికం. ఇప్పటికే రూ.72 కోట్లు చెల్లించినట్లు మంత్రులకు  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య వివరించారు. హైకోర్టు తీర్పుతో చెరకు రైతులకు మేలు జరిగిందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి  గౌతం రెడ్డి అన్నారు. అక్టోబర్ 5వ తేదీ టెండర్ గురించి ఆరా తీసారు. చక్కెర ధర పెరిగిన నేపథ్యంలో వీలైనంత త్వరగా అమ్మకాల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి కన్నబాబు అన్నారు. చక్కెర ఫ్యాక్టరీల ఇబ్బందులు, చెరకు రైతులు సమస్యలు, ఫ్యాక్టరీల ఉద్యోగుల జీతాల వంటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. చక్కెర అమ్మకాలు, వీఆర్ఎస్ స్కీమ్ అమలు సహా మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయాలు ఆర్థిక శాఖతో ముడిపడి ఉన్నాయని  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడించారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Ministerial subcommittee meeting on management of timber factories

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page