శ్రమదానం ఎవ్వరూ ఆపలేరు

0 8,597

విజయవాడ   ము చ్చట్లు:

జనసేన పార్టీ ఎల్లుండి తలపెట్టబోయే రోడ్ల మరమత్తుకు చేసే శ్రమదానం కార్యక్రమాని ఎవ్వరూ అడ్డుకోలేరని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇవాళ ఆయన శ్రమదానం అంశం మీద టీవీ9తో మాట్లాడారు. “మంచి పని చేస్తున్నాం, ఎందుకు అడ్డుకుంటారు? ప్రభుత్యం రోడ్ల మరమ్మత్తులు చేయట్లేదు కాబట్టే మేము ముందుకొచ్చాము.” అని ఆయన అన్నారు.కడప జిల్లా బుద్వేల్ ఉప ఎన్నిక అభ్యర్థి పై సాయంత్రం లోగా ప్రకటన చేస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. రెండు నెలలుగా బీజేపీ జనసేన అంతర్గత సమావేశాల్లో ఈ విషయం పై చర్చించామని వెల్లడించారు. ఇరు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చి పార్టీ అభ్యర్థిని ఉమ్మడిగా ప్రకటిస్తామని చెప్పారు. ఇలా ఉండగా, తూర్పు గోదావరి జిల్లాలో అక్టోబర్‌ 2న పవన్‌ కళ్యాణ్‌ చేయబోయే శ్రమదానానికి అనుమతి నిరాకరించారు అధికారులు.కాగా, కాటన్ బ్యారేజీపై అక్టోబర్‌ 2వ తేదీన శ్రమ దానానికి ప్లాన్‌ చేసింది జనసేన. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నందున వాటిని బాగు చేసి నిరసన తెలపాలని ప్రకటించింది. అయితే శ్రమదానానికి అనుమతి లేదని ప్రకటించారు ఇరిగేషన్‌ ఎస్‌ఈ. కాటన్ బ్యారేజీ రోడ్ ఆర్ అండ్ బి పరిధిలోకి రాదని స్పష్టం చేశారు.మానవతా దృక్పథంతో ప్రజల రాకపోకలకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం కలుగుతుందన్న, కాబట్టి అనుమతి కుదరదని స్పష్టం చేశారు. మరోవైపు బ్యారేజీపై శ్రమదానం చేసి తీరతామని చెబుతున్నారు జనసేన కార్యకర్తలు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:No one can stop the toil

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page