బోనాలతో, బతుకమ్మలతో, కొలాటాలతో స్వాగతం పలికిన మహిళలు.

0 8,745

-సిర్శపల్లిలో బీజేపీ జెండా ఎగురవేసిన ఈటల రాజేందర్

హుజూరాబాద్ ముచ్చట్లు:

- Advertisement -

హుజూరాబాద్ మండలం సిర్శపల్లి లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్. భారీ స్వాగతం  గ్రామస్తులు పలికారు. ప్రచారానికి  మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, బొడిగ శోభ, బీజేపీ మండల అధ్యక్షుడు రావుల కుమార్, కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ  చైర్మన్ తుల ఉమ, ఎయూ ఐకాస నేత సురేష్ యాదవ్, సిర్శపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, లింగరావు, రామరాజు, మల్లారెడ్డి, రవీందర్ రెడ్డి, రవి, చిరంజీవి తదతరులు హజరయ్యారు.
ఈటలరాజేందర్ మాట్లాడుతూ దళిత బంధు ఇవ్వాలి అని డిమాండ్ చేసిన నామీద అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.  దొంగ సంతకాలు పెట్టి, దొంగ లెటర్స్ సృష్టించి తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు.  దళిత బంధు బంద్ పెట్టాలి.. ఈటల రాజేందర్ ను బొంద పెట్టాలి అని చూస్తున్నారు.  దళిత బంధు అందరికీ అందించాలని మరో మారు డిమాండ్ చేస్తున్న.  ఇతర కులాల్లో ఉన్న, మతాల్లో ఉన్న పేద వారికి అందరికీ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. దూప అయినప్పుడు బాయి తవ్వుకినే వాడివి నువ్వు కెసిఆర్. ఎన్నికలప్పుడు నీకు ప్రజలు గుర్తుకు వస్తారు, అంబేడ్కర్ గుర్తుకు వస్తారు.  5 నెలలుగా హుజూరాబాద్ తప్ప ఇంకేమీ పట్టించుకోవడం లేదు. వరదల గురించి మాట్లాడడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడు. నిరుద్యోగ భృతి ఇవ్వడు.  ప్రగతి భవన్ లో కూర్చొని ప్రజల కోసం పని చెయ్యడు. కుట్రలు చేస్తాడు.  ఈటెల రాజేందర్ ను అవమానించడం, బొందపెట్టడమే పని.  సిర్శపల్లి సిరుల పల్లి.  వడ్లు కొనను అంటే కొనాలి అని డిమాండ్ చేసినా. నేను కరోనా పేషెంట్ల కాపాడే పనిలో ఉంటే మంచి పేరు వచ్చింది అని భూ కుంభకోణం చేసిన అని బయటికి పంపిండు.

సిగ్గుమాలిన, దరిద్రపు ముఖ్యమంత్రి కెసిఆర్. తప్పు చేస్తే నేను ఏ శిక్షకు అయినా సిద్ధమే.  సీఎం గారు రాజకీయ వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారు.. దాంట్లోనే నువ్వు కూడా మాడి మసి అయిపోతావు బిడ్డ.  సీఎం కుర్చీకి ఎసరు పెడితే పెట్టేది హరీష్, కేటీఆర్, కవిత,సంతోష్ తప్ప మేము కాదు. మేము మనిషిలాగా చూడమని కొరినం.  ఒక్క డబుల్ బెడ్ రూం కట్టలేదు, ఒక్క రోడ్డు వెయ్యలేదు అని హరీష్ అనడం కరెక్టేనా, అబద్దాల కోరు హరీష్. వారి జీవితమే అబద్దాలమయం.  రాజేందర్ తల ఎత్తుతుండు నరకాలని చూస్తున్నారు.  దళిత బంధు, గొర్లు, పెన్షన్, పావలా వడ్డీ 2017-18 నుండి రాలేదు, ఎవరి వల్ల వచ్చాయో గుర్తు పెట్టుకోండి. నన్ను మర్చిపోకండి.  నా పక్కన ఉన్నవారు అటు పోయారు కదా! మీ సోకులకు, మీ డబ్బులకు కారణం నేను.  అన్నం పెట్టిన వారికి సున్నం పెడుతున్నారు. నేను మీకు టికెట్, ఇచ్చి గెలిపించినా. కెసిఆర్ అయన బిడ్డ, కొడుకు కూలి పని చేసి, వ్యాపారం చేసి సంపాదించిన డబ్బు కాదు అది అక్రమ సంపాదన తీసుకోండి. ఓటు మాత్రం మాకు వేయండని అన్నారు.  ద్రోహుల, బ్రోకర్ ల మాట వినకండి.  ఇది కులాల మధ్య లొల్లి కాదు. నేను పొత్తుల సద్దిని.  అన్ని కులాల, మతాలకు వ్యతిరేకం కాదు కెసిఆర్ అహంకారానికి వ్యతిరేకం.  నేను గెలిస్తే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హుజురాబాద్ ప్రజల చైతన్యం గెలిచినట్టు.  దొంగ లెటర్స్ సృష్టించి కాదు.. ధీరుడువు అయితే నిజాయితీగా కొట్లాడని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ మాట్లాడుతూ కెసిఆర్ తెరాసా వాళ్ళను కొనలేక, సాదలేక ఢిల్లీ వెళ్లి హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ తెప్పించినందుకు ధన్యవాదాలు. రాజేందర్ అన్న మీకు మేము అండగా ఉన్నామని వచ్చిన సీర్శపల్లి గ్రామస్థులకు కృతజ్ఞతలు.  కెసిఆర్ వి అన్నీ ఉట్టికి అందని ఉత్తి మాటలు.  దేశంలో నంబర్ వన్ అబద్దాల కొరు.  దళిత బంధు అందరికీ ఇవ్వాలి.  ఎస్ఎంఎస్ లు వచ్చాయి కానీ అకౌంట్ లు డబ్బులు పడలేదు.  దళిత జాతికి ఇది అవమానం. కెసిఆర్ మోసం.  దళితులలో పెట్టుకున్న వారు దేశంలో బాగుపడలేదు. పాతి పెడతారు.  రాజేందర్ అన్నను అసెంబ్లీ కి పంపితే మన గొంతుకై ప్రశ్నించి మన డబ్బులు తీసుకువస్తారు.  దసరాకి కవితమ్మ కట్టే చీరెలే ఇవ్వాలని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే ధర్మారావు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా పని చేసిన ఈటెల రాజేందర్ ను బయటికి పంపి పెద్ద తప్పు చేశారు.  దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Women greeted with bonas, batukammas, kolatas.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page