10 లక్షల ఎకరాలు ఖాళీ

0 8,562

ఏలూరు   ముచ్చట్లు:

అదను తప్పిన వానలు, కరోనా, ఆనక గిట్టుబాటుధరల్లేమి ఈ మారు ఖరీఫ్‌ను కుంగదీశాయి. సాధారణ విస్తీర్ణంలో నాలుగు లక్షల హెక్టార్లు (పది లక్షల ఎకరాలు) సేద్యానికి నోచుకోలేదు. సీజన్‌ నార్మల్‌లో 11 శాతం సాగు తగ్గింది. నవ్యాంధ్ర ఏర్పడ్డాక ఇంతటి స్థాయిలో సాగుకు యోగ్యమైన పొలాలు బీడు పడడం ఇప్పుడేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాదాపు అన్ని పంటల సాగు తగ్గింది. ఆహారధాన్యాలు 1.68 లక్షల హెక్టార్లు (4 లక్షల ఎకరాలు) తగ్గాయి. నార్మల్‌లో 8 శాతం లోటు. జూన్‌-సెప్టెంబర్‌ ఖరీఫ్‌ కాలం కాగా గురువారంతో సీజన్‌ ముగుస్తున్న వేళ సాగు లెక్కలను వ్యవసాయశాఖ వెల్లడించింది. అన్ని పంటలూ కలుపుకొని నార్మల్‌ సాగు 37.33 లక్షల హెక్టార్లు కాగా 33.32 లక్షల హెక్టార్లలో సేద్యం జరిగింది. ప్రభుత్వం ఈ ఏడాది నార్మల్‌కు మించి 38.14 లక్షల హెక్టార్లలో సాగును ఆశించగా కనీసం సీజన్‌ నార్మల్‌ మేరకన్నా సాగు కాలేదు. ఆహార పంటల్లో ప్రధానమైన వరి 53 వేల హెక్టార్లు (3 శాతం) తగ్గింది. భూగర్భ జలాలతోపాటు ప్రధాన రిజర్వాయర్లలో, చెరువుల్లో, కుంటల్లో సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో సైతం వరి తగ్గింది. అక్టోబర్‌ రెండవ వారం వరకు నీటి వసతులున్న చోట్ల వరి వేస్తారని చెబుతున్నప్పటికీ మహా అయితే ఇంకో 20 వేల హెక్టార్లలోపేనని అంచనా వేస్తున్నారు. చిరుధాన్యాలలో మొక్కజన్న మినహా అన్ని పంటలూ తగ్గాయి. మొత్తంగా చిరుధాన్యాలు 24 వేల హెక్టార్లు (13 శాతం) తగ్గాయి. ఈ తడవ పప్పుధాన్యాలు 84 వేల హెక్టార్లు (25 శాతం) తగ్గాయి. కందులు, పెసలు, మినుములు, అలసందలు అన్నీ తగ్గాయి. నూనెగింజలు 84 వేల హెక్టార్లు (11 శాతం) తగ్గాయి. వేరుశనగ 75 వేల హెక్టార్లు (10 శాతం) తగ్గింది. ఆముదాలు, నువ్వులు సైతం తగ్గుదలే.ఈ మారు వాణిజ్య పంటల సాగు కూడా తగ్గింది.

 

- Advertisement -

పత్తి 96 వేల హెక్టార్లు (16 శాతం) తగ్గింది. జూట్‌, పసుపు, ఉల్లి, చెరకు సైతం తగ్గాయి. ఒక్క మిరప మాత్రమే నూటికి నూరు శాతం సాగైంది. జిల్లాల వారీగా చూసినా ఈ ఏడాది నూటికి నూరు శాతం నార్మల్‌ సాగును చేరింది లేదు. కడపలో అత్యధికంగా 95 శాతం విస్తీర్ణంలో సాగు నమోదైంది. గుంటూరులో కనిష్టంగా 78 శాతం సేద్యం జరిగింది. ఉత్తరాంధ్రలో వర్షాభావం వలన సాగు సాగలేదు. కండలేరు జలాశయంలో నీరు ఉన్నా నెల్లూరులో నిరుటి కంటే 45 వేల హెక్టార్లలో వరి తగ్గింది. మరో వైపు ఆ జిల్లా ఇప్పటికీ వర్షాభావంలోనే మగ్గుతోంది. ఈ సారి రాయలసీమలో వర్షాలు బానే కురిశాయి. సాగు ఒక మేరకు సాగింది. నిన్న మొన్నటి గులాబ్‌ తుపాన్‌ వలన ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణ జిల్లాల్లో సుమారు రెండు లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని సర్కారు తెలిపింది. ఎన్యూమరేషన్‌ పూర్తయితే నష్టం పెరిగే అవకాశం ఉంది.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:10 lakh acres vacant

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page