ఘనంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం

0 7,565

-నంద్యాల లో రాయలసీమ పరిరక్షణ సమితి

నంద్యాల   ముచ్చట్లు:

- Advertisement -

తెలంగాణా అంధ్ర రాష్ట్రంతో కలిసి అంధ్రప్రదేశ్ ఏర్పడిన నవంబర్ 1 న నిర్వహిస్తున్న అంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వెంటనే నిలుపు చేయాలని కోరారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంగా  అంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1 న ఘనంగా నిర్వహించాలని కోరారు.ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయి ప్రత్యేక తెలుగు రాష్ట్ర  ఏర్పాటుకు కీలకమైన రాయలసీమ హక్కుల పత్రం “శ్రిబాగ్” ఒడంబడికను అమలు పరచండి అన్నారు.  రాయలసీమలో రాజధాని/ హైకోర్టు ఏర్పాటు చెయ్యాలి అని అన్నారు.  కృష్ణ తుంగభద్ర నీటి కేటాయింపులో  రాయలసీమకు ప్రధమ ప్రాధాన్యతతో కేటాయించండి అన్నారు.
ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకున్నట్లు రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వైన్ .రెడ్డి తెలిపారు. శుక్రవారం  నంద్యాలలోని రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయం నుంచి  సంజీవనగర్ జంక్షన్ వరకు ర్యాలిగా బయలుదేరి  అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వైయన్ .రెడ్డి ,ఏర్వ రామచంద్రారెడ్డి, వెంకటసుబ్బయ్యలు మాట్లాడుతూ.ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రాంతం వివక్షకు గురి అవుతున్న నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర సాధనకు బీజం పడిందని అన్నారు.
ఈ ఉద్యమంలో తొలి విజయం 1926 లో ఆంధ్రకు ప్రత్యేక విశ్వవిద్యాలయం స్థానంతో కలిగిందని, రాయలసీమలోని అనంతపురంలో ఏర్పాటు చేయవలసిన విశ్వవిద్యాలయంను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడంతో రాయలసీమ వారు ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఉద్యమానికి దూరమయ్యారని అన్నారు.రాయలసీమ జిల్లాల సహకారం లేనిదే ఆంధ్ర రాష్ట్ర సాధన జరిగదని భావించిన ఆంధ్ర మహాసభ పెద్దలు, నూతన తెలుగు రాష్ట్రంలో రాయలసీమ అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తామని “శ్రీబాగ్ ఒడంబడికను” నవంబర్ 17, 1937 న చేయడం జరిగింది తెలిపారు. శ్రీబాగ్ ఒడంబడికలో కీలకమైన అంశాలు  రాజధాని/ హైకోర్టు ను రాయలసీమ లో ఏర్పాటు చెయ్యడం, కృష్ణా తుంగభద్ర జలాలను రాయలసీమ సంపూర్ణ అవసరాల కోసం వినియోగించడం.  ప్రత్యేక తెలుగు రాష్ట్రంలో శ్రీబాగ్  ఒడంబడిక అమలు జరిగి రాయలసీమ అభివృద్ధి చెందుతుందని భావించి,  రాయలసీమ వాసులు ఆంధ్ర నాయకులతో  కలసి అలుపెరగని పోరాటం చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని  అక్టోబర్ 1, 1953 న సాధించారన్నారు.

కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం 3 సంవత్సరాలు కొనసాగింది. అనంతరం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంతో జత కలవడంతో 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం,  తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుండి జూన్ 2, 2014 లో విడిపోవడంతో అక్టోబర్ 1 1953 లో సాదించుకున్న భూభాగంతో ఆంధ్రప్రదేశ్ నేడు కొనసాగుతున్నదని, అసలైన అంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినం అక్టోబర్ 1. అయితే గత ప్రభుత్వం తెలంగాణా అంధ్రప్రదేశ్ నుండి విడిపోయిన జూన్ 2 న అంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా నిర్వహించిందని అన్నారు. ప్రస్థుత ప్రభుత్వం తెలంగాణా ఆంధ్ర రాష్ట్రంతో కలసిన నవంబర్ 1 న అంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్విహిస్తున్నదని,  ప్రభుత్వం శ్రీ బాగ్ ఒడంబడికను గౌరవిస్తున్నామని శాసనసభ సాక్షిగా ప్రకటించినా, ఆ దిశగా కార్యాచరణ చేపట్టలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1 న నిర్వహించక పోవడం, తద్వారా  రాష్ట్ర అవతరణకు కీలకమైన శ్రీ బాగ్ ఒడంబడికను ప్రజల స్మృతి పధం నుండి తుడిచి వేసే చర్యగా రాయలసీమ వాసులు భావిస్తున్నారని,ఈ నేపధ్యంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి దత్తమండలాలకు రాయలసీమ నామకరణం జరిగిన నంద్యాలలో అక్టోబర్ 1, 2021 న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించామని అన్నారు.
ఈ సంధర్భంగా  అక్టోబర్ 1 ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ  దినోత్సవంగా  ప్రభుత్వం ప్రకటించాలని వారు డిమాండ్ చేసారు..  తెలుగు  రాష్ట్ర సాధనకు కీలకమైన శ్రీబాగ్ ఒడంబడిక అమలుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని, అన్ని రాజకీయ పార్టీలు అక్టోబర్ 1 న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించేలాగా, రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందటానికి  నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమంలో పట్నం రాముడు, మునగాల చంద్రశేఖర్ రెడ్డి, రాఘవేంద్ర గౌడ్, మహమ్మద్ పర్వేజ్, జూపల్లి గోపాల్ రెడ్డి, కొమ్మా శ్రీహరి, భీమశంకర్ రెడ్డి, లక్ష్మీ నారాయణ, మనోజ్ కుమార్ రెడ్డి, రైతునగరం భాస్కర్ రెడ్డి, తూము శివారెడ్డి, షణ్ముకరావు, యమ్ వి .రమణారెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Andhra Pradesh State Landing Day

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page