పల్లె ప్రకృతి వనాలతో గ్రామీణ ప్రాంతాలల్లో ప్రశాంత వాతావరణం

0 8,592

మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ జి ఓ ఐ జాయింట్ సెక్రటరీ చరణ్ జిత్ సింగ్

కామారెడ్డిముచ్చట్లు:

- Advertisement -

కామారెడ్డి జిల్లాలో పల్లె ప్రకృతి వనాలతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రశాంత వాతావరణం లభించిందని  మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జయింట్ సెక్రెటరీ చరణ్ జిత్ సింగ్ అన్నారు. సదాశివనగర్ మండలం భూంపల్లి లోని అంబరీషుడి గుట్టపైన ఉన్న పల్లె ప్రకృతి వనం ను పరిశీలించారు. వర్క్ బోర్డు ని సందర్శించారు. ప్రకృతి వనం లోని మొక్కలు వృక్షాలు గా మారాయని సర్పంచ్ లలిత తెలిపారు. వాచర్ నారాయణ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమంలో మినిస్టరీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆర్.పి. సింగ్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్  ధోత్రే, సర్పంచ్ లలిత, జడ్పీ సీఈఓ సాయా గౌడ్ , డిపివో సునంద, ఎంపీడీవో రాజువీర్, ఏ పీ ఓ శృతి, అధికారులు పాల్గొన్నారు.అలాగే ఈ రోజు గాంధారి మండల కేంద్రంలో అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలను కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ జెయింట్ సెక్రెటరీ చరణ్ జిత్ సింగ్ , డైరెక్టర్ ఆర్పి సింగ్  పరిశీలించారు. మొకరం చెరువులో జరిగిన పూడికతీత పనులను చూశారు. సారవంతమైన మట్టిని తమ పంట పొలాల్లో వేసుకోవడం వల్ల పంట దిగుబడి పెరిగిందని రైతులు తెలిపారు.భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగినట్లు చెప్పారు. కూలీల జాబ్ పనులను పరిశీలించారు.  గ్రామ పంచాయతీ వద్ద ఉపాధిహామీ వర్క్ ఫైళ్లను పరిశీలించారు. అనంతరం కంటూర్ కందకాలను పరిశీలించారు. వాటి వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గాంధారి మండలం సీతాయిపల్లి లో గొర్రెల షెడ్లు ను సందర్శించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఈ షెడు నిర్మాణం  చేసినట్లు లబ్ధిదారుడు మల్లేష్ తెలిపారు. వైకుంఠధామం , పల్లె ప్రకృతి వనం, కంపోస్టు షెడ్లు ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో చేపట్టిన పనులపై చర్చించారు. అవసరం ఉన్న వారికి జాబ్ కార్డులను అధికారులు అందజేస్తారని చెప్పారు. జాబ్ కార్డ్లను, పాసు పుస్తకాలను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చిన డబ్బులతో కూలీలు ఏం చేస్తున్నారని కేంద్ర బృందం సభ్యులు వివరాలు అడిగారు. కుటుంబ అవసరాలకు డబ్బులను వినియోగిస్తున్నామని కూలీలు పేర్కొన్నారు. గడ్డపారలు, పావుడలు అందజేయాలని కూలీలు కోరారు.  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేశ్  వి పాటిల్, స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ , జెడ్పీ సీఈవో సాయి గౌడ్, జిల్లా పంచాయతీ అధికారి ని సునంద, ఉపాధి హామీ ఏపీ డి లు సాయన్న, శ్రీకాంత్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Calm atmosphere in rural areas with rural nature forests

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page