సబ్సిడీ పై రైతులకు పరికరాలు

0 8,592

మద్దికేరముచ్చట్లు:

మండల కేంద్రమైన మద్దికేర లో జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా నమోదు చేసుకున్న గ్రూప్ సభ్యులకు సబ్సిడీ పై వ్యవసాయ పరికరాలను మద్దికేర జడ్పీటీసీ మురళీధర్రెడ్డి అందజేశారు.శుక్రవారం రోజున రైతు భరోసా కేంద్రం నందు సబ్సిడి పై తైవన్ స్ప్రేలు,తర్పాలిన్ లను జెడ్పీటీసీ సభ్యులు మురళిధర్ రెడ్డి చేతుల మీదుగా అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కొరకు వైఎస్సార్ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన తెలియజేశారు. అనంతరం వ్యవసాయ అధికారిణి హేమలత మాట్లాడుతూ ఖరిఫ్ పంట నమోదు చేసుకున్న ప్రతి ఒక్క రైతు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, ఏఈఓ శ్రీనివాస్ రెడ్డి,విఏఏ జాకీర్ హుస్సేన్, ఆనంద్,గ్రామ రైతులు సహోదరులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Equipment for farmers on subsidy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page