కమలం గూటికి తీన్మార్

0 9,875

హైదరాబాద్ ముచ్చట్లు:

 

తెలంగాణలో బిగ్ బ్రేకింగ్ న్యూస్. కేసీఆర్ సర్కార్‌పై సమరశంఖం పూరించి.. కేసుల్లో ఇరుక్కుని జైలుపాలైన క్యూన్యూస్ చీఫ్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరనున్నారు. ఆయన కమల తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన సొంత చానల్ క్యూ న్యూస్ అధికారికంగా తెలిపింది. ఆయన బీజేపీలో చేరనున్నట్లు క్యూ న్యూస్ టీం ప్రకటించింది. మోదీ సిద్ధాంతాలకు ఆకర్షితులై బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే పలు కేసులు ఎదుర్కొంటూ జైలుకెళ్లిన తీన్మార్ మల్లన్నని విడుదల చేయించేందుకు ఆయన భార్య మమత ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డాకి లేఖలు రాయడం సంచలనంగా మారింది.రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టిందని.. ఆయన్ను విడిపించాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. ఆయన సలహా మేరకే తాను మెయిల్స్ రాస్తున్నానని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. జోతిష్యుడిని బెదిరించిన కేసులో జైలుపాలైన తీన్మార్ మల్లన్న బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ వెంటనే మరో కేసులో ఆయనను రిమాండ్‌కి పంపించారు. మల్లన్న జైలుకెళ్లి ఇప్పటికి 34 రోజులు అవుతోంది. ఆయన్ను విడిపించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని.. ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో బయటపడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags; Flight services to Warangal soon

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page