రన్నింగ్ బస్సు నుంచి దిగి…

0 8,768

హైదరాబాద్ ముచ్చట్లు:

ఓ ఆర్టీసీ బస్సు ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్తోంది. అందులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు రన్నింగ్‌లో బస్ దిగి పెన్సింగ్ దూకేసి హుస్సేన్‌సాగర్‌లో దూకేశాడు. ఊహించని ఈ ఘటనతో షాకైన వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లోని మౌలాలీలో ఉంటూ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రేమ పేరుతో అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి వెంట పడుతున్నాడు. తనకిష్టం లేదని ఆమె చెప్పినా వినిపించుకోకుండా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో యువతి తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. వారు ఆ యువకుడిని పిలిపించి తమ కూతురి వెంట పడొద్దని మందలించారు. మరోసారి ఇలా చేస్తే పోలీస్ కేసు పెడతామని హెచ్చరించారు.దీంతో భయాందోళనకు గురైన యువకుడు గురువారం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ట్యాంక్ బండ్ రాగానే రన్నింగ్‌లో దిగిపోయాడు. పరుగెత్తుకుంటూ వెళ్లి హుస్సేన్‌సాగర్‌లో దూకేశాడు. దీంతో కొందరు వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడే గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు గమనించి నీళ్లలోకి దూకి అతడిని ఒడ్డుకు చేర్చారు. అతడు ఆరోగ్యంగానే ఉండటంతో కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఆ యువకుడిని కాపాడిన లేక్‌ కానిస్టేబుళ్లు అభిలాష్‌, రాజులను ఉన్నతాధికారులు అభినందించారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Get off the running bus …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page