ఘనంగా విజయదుర్గా దేవి ఆలయ శరన్నవరాత్రి ఉడుపు రాట మహోత్సవం

0 7,559

– ఈ నెల 7 నుండి 15 వరకు ఉత్సవాలు
-ఆలయ ధర్మకర్త బంగారు లక్ష్మీ

మధురవాడ ముచ్చట్లు:

- Advertisement -

శ్రీశ్రీశ్రీ విజయదుర్గా దేవి ఆలయ  శరన్నవరాత్రి ఉడుపు రాట మహోత్సవం శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు బంగారు సుబ్బారావు, లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకులు శ్రీకాంత్ శర్మ శాస్త్రోక్తంగా టైలర్స్ కాలనీ,విజయదుర్గా దేవి ఆలయ ప్రాంగణంలో పూజలు నిర్వహించారు..ఈ సందర్బంగా ఆలయ ధర్మకర్త బంగారు లక్ష్మీ మాట్లాడుతూ మధురవాడ పరిసర ప్రాంతాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని  గత 30 ఏళ్లుగా అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు.. ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు..ఈ నెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు..ఈ ఉత్సవాల్లో ప్రతీ రోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు,సహస్ర కుంకుమార్చన , పంచామృత అభిషేకాలు,హోమాలతో పాటుగా కలశ యాత్ర, వసంతోత్సవం, అన్న సమారాధ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు..కావున భక్తులు ఉత్సవాల్లో పాల్గొని విజయదుర్గా దేవి ఆశీస్సులు పొందాలని ఆమె కోరారు..ఇందులో భాగంగా ఉడుపు రాట కార్యక్రమంలో వైఎస్సార్సీపీ 7వ వార్డు అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు,వైసీపీ సీనియర్ నాయకులు వంకాయల మారుతీ ప్రసాద్,పసుపులేటి గోపి,బెల్లాన పాపారావు,రజిని,చిన్ని,ఆలయ నిర్వాహకులు బంగారు ప్రకాష్ తదితరులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు..ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ భక్తులు  కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాల్లో పాల్గొనాలని సూచించారు.. అమ్మవారి కరుణా కాటాక్షాలతో రాష్ట్రాభివృద్ధి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని జగన్మాతను ప్రార్దించినట్టు పేర్కొన్నారు..ఈ ఉడుపు రాటా మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ,ప్రసాదాలు స్వీకరించారు..

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Ghananga Vijayadurga Devi Temple Sharannavaratri Udupu Rata Mahotsavam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page