తెలుగు ఆకాడమీ నిధుల పై దర్యాప్తు ముమ్మరం

0 9,860

హైదరాబాద్ ముచ్చట్లు:

 


తెలుగు అకాడమీ  నిధులు 60 కోట్లు  ఇప్పటివరకు గల్లంతైనట్లు గుర్తించడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు. యూనియన్ బ్యాంక్ కార్వాన్ శాఖ నుండి 43 కోట్లు..  సంతోష్ నగర్ శాఖ నుండి ఎనిమిది కోట్లు.  చందానగర్ కెనరా బ్యాంక్ శాఖ నుండి  9 కోట్లు గల్లంతు అయినట్లు గుర్తించారు. ప్రధాన సూత్రధారి తోపాటు మరో అనుమానితుడి  సిసిఎస్ పోలీసులు  విచారిస్తున్నారు. చందానగర్ కెనరా బ్యాంక్ నుండి 9 కోట్లు ఇతరుల సహాయంతో కాజేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించినట్లు సమాచారం. శుక్రవారం నాడు నేడు  కెనరా బ్యాంక్ సంబంధించి మరో ఫిర్యాదును  తెలుగు అకాడమీ దాఖలు చేసింది. త్రిసభ్య కమిటీ విచారణలో అకాడమీ  అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. జిహెచ్ఎంసి పరిధిలో10 ప్రభుత్వ  బ్యాంకులకు చెందిన  30 బ్రాంచీలలో తెలుగు అకాడమీకి చెందిన 320 కోట్ల నిధుల డిపాజిట్లు వున్నాయి. చందానగర్ కెనరా  బ్యాంకులో ఉన్న 33 కోట్ల  ఎఫ్ డి లలో  ఇటీవలే 20 కోట్లు  అకాడమీ అధికారులు విత్ డ్రా చేసారు. ఈ నేపధ్యంలో 30 బ్యాంకుల శాఖల కు వెళ్లి  నిధుల భద్రతను తెలుగు అకాడమి అధికారుల  బృందాలుపరిశీలిస్తున్ఆనయి. తెలుగు అకాడమీ అధికారుల విచారణ పూర్తయినందున త్రిసభ్య కమిటీ యూనియన్ బ్యాంక్ అధికారులను విచారించింది.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Investigation on Telugu Academy funds is in full swing

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page