పీకేల మధ్యనట్టి కుమార్

0 8,563

హైదరాబాద్   ముచ్చట్లు:

రిపబ్లిక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల తాలుకూ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తనపై కోపంతో వైసీపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీపై కక్ష కడుతోందని, అందులో భాగంగానే టికెట్లు ప్రభుత్వం అమ్ముతోందనే సరికొత్త చర్చకు దారి తీశారు పవన్‌ కళ్యాణ్‌. ఇక పవన్‌ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా రంగంలోకి దిగిన నటుడు పోసాని పవన్‌పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తనను పవన్‌ అభిమానులు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారంటూ ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ పవన్‌పై మాటల దాడికి దిగారు పోసాని. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ వర్సెస్‌ పోసాని అన్నట్లు వివాదం మారింది. ఈ క్రమంలోనే పవన్‌ ఫ్యాన్స్‌ పోసాని ఇంటిపై రాళ్ల దాడికి కూడా దిగారు. ఇప్పుడీ వివాదంలోకి నిర్మాత నట్టి కుమార్‌ వచ్చి చేరారు.తాజాగా పవన్‌, పోసానీల వ్యవహారంపై స్పందించిన నట్టికుమార్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోసాని కృష్ణమురళి ఇంటి మీద పవన్‌ ఫ్యాన్స్‌ చేసిన దాడిని ఖండిస్తున్నానని తెలిపారు. ఎవరు మాట్లాడినా మధ్యలోకి కుటుంబాలాను తీసుకొస్తున్నారని ఆరోపించిన నట్టి కుమార్.. అభిమానులు కూడా మీ నాయకులకు మంచి పేరు వచ్చేలా ప్రవర్తించాలని హితవు పలికారు. తెలంగాణకు చెందిన జనసేన నాయకుడు ఆంధ్ర, తెలంగాణ అనే భేదం తీసుకువస్తున్నారని.. ఇదిలా చాలా తప్పని, మనమందరం కలిసి ఉన్నామని తప్పుగా మాట్లాడవద్దంటూ హితవు పలికారు. ప్రస్తుతం ఉన్న ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ ప్రేక్షకుల నుంచి ఎక్కువ రేట్లు వసూలు చేస్తుంటే ప్రభుత్వాలు, అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఏ సమావేశం జరిగినా వారే ఎందుకు పాల్గొంటారు.? సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం ఆ ఆరుగురేనా.? చిన్న నిర్మాతలను సమావేశాలకు ఎందుకు పిలవరంటూ ప్రశ్నలు సంధించారు.ఇక జగన్‌ అందరినీ అందరివాడిలా చూస్తారని తెలిపిన నట్టికుమార్.. పవన్ కళ్యాణ్‌ ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్‌ ఇందులో ఎవరికి ఎలాంటి భేదాభిప్రాయం లేదని, కానీ రాజకీయంగా మాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొందరు నిర్మాతలు పవన్‌కు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని విమర్శించారు. ఇక ఛాంబర్‌ నుంచి వచ్చి లేఖ అందిరతో చర్చించి రాయలేదని.. కేవలం ప్రెసిడెంట్‌, కార్యదర్శి మాత్రమే పంపించారని నట్టికుమార్‌ ఆరోపించారు. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా.? లేదా ఇంకా ఇలానే కొనసాగుతూనే ఉంటుందా వేచి చూడాలి.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Kumar in the middle of Pike

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page