సెల్ఫ్ గోల్ చేసుకున్న పోసాని

0 9,692

హైదరాబాద్ ముచ్చట్లు:

 

పోసాని కృష్ణమురళి తెలుగు సినిమా ఇండ్రస్ట్రీలో పెద్ద కుటుంబాన్నే ఎదుర్కొన్నారు. జగన్ కోసమే ఆయన పవన్ కల్యాణ్ పై కామెంట్స్ చేశారు. అయితే తీరా సీన్ ఏంటంటే… ఈ ఎపిసోడ్ లో పోసాని కృష్ణమురళి ఒంటరి అయ్యారనే చెప్పాలి. పోసానిపై కేసులు నమోదవుతున్నాయి. టీడీపీ, జనసేన సోషల్ మీడియా లో ట్రోలింగ్ జరుగుతోంది. అయినా వైసీపీ నేతలు ఎవరూ, సినిమా ఇండ్రస్ట్రీలో ఉన్న వైసీపీ సానుభూతి పరులు ఎవ్వరూ పోసాని కృష్ణమురళికి అండగా నిలవలేదు.పోసాని కృష్ణమురళి జగన్ కు అండగానే ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో పవన్ ను సూటిగా ప్రశ్నించారు. తొలిరోజు ప్రెస్ మీట్ లో పంజాబీ యువతిని వివాదంలోకి లాగడంతో పోసాని కృష్ణమురళిపై వారికి కాలింది. దీంతో ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. ఫోన్లు చేసి వేధించారు. తన ఇంట్లోవారిని కూడా అసభ్య పదజాలంతో దూషించారని పోసాని కృష్ణమురళి చెబుతున్నారు. రెండోరోజు మాత్రం పోసాని కృష్ణమురళి కొంత నోరు జారారు. అసభ్య పదజాలాన్ని వాడాడు. దీన్ని అందరూ ఖండించాల్సిందే.కానీ పోసాని కృష్ణమురళి ఎవరి కోసం ఇంత రాద్ధాంతం చేశాడు? ఎవరికి అండగా నిలబడాలని ఆయన తపన పడ్డారు.

 

 

- Advertisement -

జగన్ కే కదా? కానీ విచిత్రంగా పోసాని కృష్ణమురళికి వైసీపీ నుంచి మద్దతు కరువైంది. వారెవ్వరూ పోసానికి అండగా నిలబడలేదు. పైగా ఆయనతో తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం విశేషం. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా మాత్రం పోసాని కృష్ణమురళికి వెన్నుదన్నుగా నిలిచింది.పోసాని కృష్ణమురళి దాదాపు పదేళ్లుగా వైసీపీ అభిమానిగా ఉన్నారు. ఆయనకు అవసరమైనప్పుడల్లా మద్దతు ఇస్తున్నారు. పోసాని కృష్ణమురళి పదవుల కోసం ఈ కామెంట్స్ చేస్తున్నట్లు ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకూ ఆయన జగన్ ను కూడా కలవలేదు. ఎలాంటి పదవులను కోరుకోలేదు. జగన్ మీద అభిమానంతోనే మెగా కుటుంబంతో వైరాన్ని పెట్టుకున్నారు. బహుశ సినిమా పరంగా ఇక ఆయనకు అవకాశాలు దక్కకపోవచ్చు. అయినా పోసాని తన పట్టును వదలడం లేదు. మరి పోసాని భవిష్యత్ ఏంటో చూడాలి మరి.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Posani who scored a self goal

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page