సైకిల్ తో సవారీ….

0 8,605

కాకినాడ ముచ్చట్లు:

జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీతో ఉన్నారు. జనసేన సర్వసభ్య సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో జరగబోయే పరిణామాలకు సంకేతాలుగా చెప్పాలి. అవసరమైతే తాను వ్యూహం మార్చుకుంటానని పవన్ కల్యాణ్ చెప్పడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనసేన అధినేత ఆలోచనలు సైకిల్ పార్టీ వైపు చూస్తున్నట్లుగానే ఉంది. ఇప్పటికే జనసేన, టీడీపీ పొత్తుపై ప్రచారం జరుగుతోంది.పవన్ కల్యాణ్ ప్రస్తుతం బీజేపీతో పొత్తుతో కొనసాగుతున్నారు. అయితే రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తే అధికారంలోకి రావడం అన్నది జరిగే పని కాదు. జగన్ పార్టీని ఎదుర్కొనాలంటే వ్యూహం మార్చాల్సిందేనని ఆయన గట్టిగా అభిప్రాయపడుతున్నారు. అది టీడీపీతో పొత్తుతోనే సాధ్యమని పవన్ కల్యాణ్ గట్టిగా విశ్వసిస్తున్నట్లు కన్పిస్తుంది. తాను టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా విజయం ఖాయమన్న ధీమాలో ఉన్నారు.అందుకే విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కమ్మ సామాజికవర్గం గురించి ప్రస్తావించినట్లు విశ్లేషణలు వినపడుతున్నాయి. వైసీపీ నేతలు కమ్మవారిపై కక్ష కట్టారని, కాశ్మీర్ పండిట్లను తరిమేసినట్లు ఒక జాతిని రాష్ట్రానికి దూరం చేయాలనుకుంటున్నారన్నారు. వారికి అండగా నిలబడతామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. అయితే ఇక్కడ పవన్ కల్యాణ్ కు ఒక చిక్కుంది అంటున్నారు.కాపు సామాజికవర్గం సహజంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ముద్రగడ పద్మనాభం పై వ్యవహరించిన తీరు, టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసులను వారు ఇప్పటికీ గుర్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తుతో దిగితే కాపు సామాజికవర్గం ఆయనకు అండగా నిలబడొచ్చు కాని, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కలసి రాకపోవచ్చు అన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. మొత్తం మీద పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు వింటే టీడీపీతో పొత్తు ఖాయంగానే కన్పిస్తుంది.
పట్టించుకోని కమలం…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు. మంత్రులు నుంచి సినీ నటుల వరకూ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గానే వీటిని చేస్తున్నప్పటికీ భాగస్వామి పార్టీ నుంచి ఎటువంటి మద్దతు పవన్ కల్యాణ‌్ కు లభించలేదు. అసలు బీజేపీ ఈవిషయంలో జోక్యం చేసుకోకూడదన్న భావనతో ఉందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.పవన్ కల్యాణ్ సినిమా టిక్కెట్ల ధరలను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడాన్ని తప్పుపడు తున్నారు. ఆన్ లైన్ విధానంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారని ఆయన చెబుతున్నారు. అయితే దీనిపై భాగస్వామ్య పార్టీగా ఉన్న బీజేపీ ఏమాత్రం స్పందించలేదు. సినిమా టిక్కెట్ల విషయంలో బీజేపీ వైఖరి ఏంటో ఇంతవరకూ చెప్పలేదు. బీజేపీ నేతలందరూ ఈ విషయంలో మౌనంగానే ఉండటంతో ప్రభుత్వానికే మద్దతు అని చెప్పకనే చెబుతున్నారనిపిస్తోంది.ఇక తాజాగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు పెద్దయెత్తున వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో దూషణలకు దిగుతున్నారు. రాజకీయంగా ఇరువైపుల చేసుకునే వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే బీజేపీ ఈ విషయంలోనూ మౌనంగానే ఉంది. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మినహా ఎవరూ పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఈ అంశంపై మాట్లాడలేదు.ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బీజేపీ పొత్తు ఉంది. అయితే కొంత కాలంగా రెండు పార్టీలూ ఎవరి దారి వారేనని చెబుతున్నాయి. పరిషత్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. జనసేన సయితం సొంతంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టింది. ఈనేపథ్యంలో రెండు పార్టీలకు మధ్య గ్యాప్ బాగా పెరిగిందన్న టాక్ రాజకీయ వర్గాల్లో విన్పిస్తుంది. ఒక వేళ బద్వేలులో కలసి పోటీ చేసినా అది పైకి మాత్రమేని, లోపల మాత్రం ఒకరిపై ఒకరు పలు అంశాల్లో..

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Riding a bicycle ….

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page