కాంగ్రెస్ నేతల ఆరెస్టు

0 7,860

హైదరాబాద్  ముచ్చట్లు:

దిల్షుక్ నగర్ దగ్గర  కాంగ్రెస్ నాయకులు మల్రెడ్డి రాం రెడ్డి, సంకేపల్లి సుధీర్ రెడ్డి లను పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ రోజు తలపెట్టిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుల అరెస్టులు జరిగాయి. రాజీవ్ గాంధీ, మహాత్మా గాంధీ విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నాయకులను పహాడీ  షరీఫ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ లను, రాజీవ్ గాంధీ, మహాత్మా గాంధీ విగ్రహాల స్వాధీనాన్ని  టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఖండించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి, జంగ్ సైరన్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని అయన అన్నారు. పోలీస్ లు అత్యుత్సాహం ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు వుంటాయని హెచ్చరించారు. పోలీసులు అడ్డుకుంటే నేనే ముందు ఉంటా.. లాఠీ తగిలినా.. తూటా తగిలినా ముందు నాకే తగులుతుంది.. కార్యకర్తలు లు భయపడాల్సిన ఆవసరం లేదు. కేసీఆర్ ఇదంతా నీకు తెలిసి జరుగుతుందా,.. తెలియక జరుగుతుందా నాకు తెలియదు. వెంటనే పోలీసులకు చెప్పు.. అనుమతి ఇవ్వమని, ప్రశాంతంగా జరిగే కార్యక్రమాలను రెచ్చగొట్టొద్దని అన్నారు. కొంత మంది పోలీస్ లు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. వారి వివరాలు అన్ని నా దగ్గర ఉన్నాయని అయన అన్నారు..

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Arrest of Congress leaders

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page