షాద్ నగర్ లో బాపు జయంతి

0 7,564

షాద్ నగర్ ముచ్చట్లు:

జాతిపిత మహాత్మాగాంధీ జీవనం ప్రజలకు ఆదర్శమని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ కొనియాడారు. బాపు జయంతిని పురస్కరించుకుని ఫరూక్ నగర్ గాంధీ చౌక్ వద్ద విగ్రహానికి శనివారం ఎమ్మెల్యే తదితరులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరంలో గాంధీ పాత్ర ఎనలేనిదని కీర్తించారు.
బాపు పోరాటం, త్యాగాలను స్మరించుకోవాల్సిన ప్రత్యేక రోజు ఇదని పేర్కొన్నారు. గాంధీ బోధనలు, ఆదర్శాలు, జీవిత విలువలను పాటిస్తూ.. మహాత్ముడు కలలు కన్న దేశాన్ని రూపొందించడానికి మనమంతా కృషి చేయాలని కోరారు. పాల్గొన్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎం.ఎస్ నటరాజన్, మాజీ చైర్మన్ విశ్వం, జడ్పీటీసీ వెంకట్రామిరెడ్డి, ఎస్సిఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్ నాయక్, మాజీ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్ లావణ్య, కౌన్సిలర్స్ కానుగు అంతయ్య, శ్రావణి, సర్వర్ పాషా, చింటూ, యుగేందర్, బచ్చలి నర్సింహులు, చెట్ల నర్సింహులు,లంకల రాఘవేందర్ రెడ్డి, జాం గారి రవి, నర్సింగ్ రావు, నందిగామ శ్రీనివాస్ ,పిల్లి శేఖర్, పిల్లి సాయి, రఘు గౌడ్, రాఘవేందర్, రాఘమా రెడ్డి, పిల్లి శారదా,చేరక శివ ,ఎస్పీ శివ,శ్రీశైలం, వెంకటేష్ గుప్తా,యాదగిరి చిన్న,జిటి శ్రీనివాస్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Bapu Jayanti in Shad Nagar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page